డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా


Thu,May 16, 2019 02:15 AM

RTC Bus Accident in Jayashankar Bhupalpally Dist

-19 మందికి గాయాలు
-భూపాలపల్లి జిల్లాలో ఘటన

మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు సమీపంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం.. గోదావరిఖని డిపోకు చెందిన బస్సు 63 మంది ప్రయాణికులతో గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. కొయ్యూరు సమీపంలోని పీవీనగర్ వద్దకు రాగానే డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి గుట్కా తినే క్రమంలో అదుపుతప్పి బస్సు లోయలో పడిపోయింది. ఘటనా స్థలిలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న కొయ్యూరు ఎస్సై నరేశ్ సిబ్బందితో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాటారం, మహదేవపూర్ దవాఖానలకు తరలించి అత్యవసర వైద్య చికిత్సలు అందించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించినట్టు ఎస్పీ భాస్కరన్ తెలిపారు.
bus-accident2
441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles