ఆర్థిక పురోభివృద్ధి దిశగా ఐదో శక్తిపీఠం

Sun,October 13, 2019 02:03 AM

-ప్రసాద్ స్కీం ద్వారా రూ. 50 కోట్ల నిధులు
-జోగుళాంబ క్షేత్రాన్ని సందర్శించిన కేంద్ర బృందం సభ్యులు

అలంపూర్, నమస్తేతెలంగాణ: ఐదో శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలు అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర బృందం అధికారులు శనివారం అలంపూర్ క్షే త్రాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీంలో భాగంగా మంజూరైన నిధులను ఏయే అభివృద్ధి పనులకు ఎంత ఖర్చు చేయాలో ఆల య ఈవో ప్రేమ్‌కుమార్‌తోపాటు దేవాదాయ, పురావస్తు, రెవెన్యూ శాఖల అధికారులతో సమాలోచన చేశారు. రూ.50 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు స్థల పరిశీలన జరిపారు. భక్తులు, పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించారు. రోడ్లు, ఉద్యాన వనా లు, గ్రీన్ పార్కులు, సోలార్, పబ్లిక్ టాయిలెట్స్, విద్యుత్ దీపాలు, సమాచార కేంద్రం ఏర్పాటు తదితర వసతులు కల్పించనున్నారు. స్కీమ్‌కు సంబంధించిన పనులపై ఇప్పటికే అధికారులు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు.

పురాతన వారసత్వ సంపద కలిగిన అలంపూర్ క్షేత్రానికి వచ్చే వారికి పర్యాటక అనుభూతి కలిగించేలా ఆలయ రూపు రేఖలు మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్యాంవర్మ, బృందం సభ్యులు శంకర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, టూరిజం ఎస్టేట్ ఆఫీసర్ సునంద, ఈఈ సరిత, ఆర్డీవో రాములు, తాసిల్దార్ తిరుపతయ్య, ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్ ఉన్నారు. కాగా అంతకుముందు బృందం సభ్యులు హైదరాబాద్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశారు. ప్రసాద్ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే అబ్రహం సమక్షంలో మంత్రి వారికి ప్రతిపాదనలు అందజేశారు.

232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles