అందుబాటులోకి ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు


Wed,June 12, 2019 02:24 AM

Rs 1550 crore for overhead reservoir Works

-రూ.1,550 కోట్లతో పనులు
-10 పట్టణాల్లో 85 శాతం పూర్తి: అరవింద్‌కుమార్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పట్టణ స్థానిక సంస్థల్లో ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లను మూడునెలల్లోపు అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఇకనుంచి పట్టణాల్లో స్వయంగా పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. మంగళవారం మాసబ్‌ట్యాంకులోని సీడీఎంఏ కార్యాలయంలో అర్బన్ మిషన్ భగీరథ, అమృత్, టీఎండీపీ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకాల కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పనితీరును అడిగి తె లుసుకొన్నారు. ఈ సం దర్భంగా అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. పది మున్సిపాలిటీల్లో రూ.1,550 కోట్లతో చేపట్టిన మంచినీటి పనులు దాదాపు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఈ సమీక్షలో ఈఎన్సీ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ పురోగతిపై కూడా అరవింద్‌కుమార్ సమీక్షించా రు. ఇందులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, అదనపు కమిషనర్లు ఐద్వెత్‌సింగ్, సిక్తాపట్నాయక్, చీఫ్ ఇంజినీర్లు శ్రీధర్, సురేశ్‌కుమార్, జియావుద్దీన్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

120
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles