ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ పూర్తి


Thu,May 16, 2019 01:39 AM

rrr Package Delivery is complete

-మల్లన్నసాగర్ పరిహారం చెల్లింపుపై హైకోర్టుకు సర్కార్ సమగ్ర నివేదిక
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు పునరావాసం, పునరోపాధి (ఆర్‌అండ్‌ఆర్) ప్యాకేజీ పంపిణీ పూర్తిచేశామని ప్రభుత్వం పేర్కొన్నది. పరిహారానికి సంబంధించిన సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించింది. పరిహారం చెల్లించకుండా పను లు చేస్తున్నారంటూ ఏటిగడ్డ కిష్టాపూర్‌వాసులు దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రాగా.. గురువారానికి వాయిదా వేసింది. గతంలో హైకోర్టు పేర్కొన్న విధంగా పరిహారం ప్యాకే జీ చెల్లింపు వివరాల నివేదికను అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు ధర్మాసనానికి సమర్పించారు. ఎనిమిది గ్రామాల్లో 4,061 కుటుంబాలకు పరిహారం అందజేశామని, 47 కుటుంబాలు పరిహారం తీసుకోలేదని తెలిపారు. నిరాకరించిన వారికి చెక్కులను స్వయంగా అందజేస్తామని కోర్టు చెప్పినందున, వారి చెక్కులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని వివిధ దశల పనులపై దాఖలైన మొత్తం 177 కేసులను కలిపి విచారించాలని కోరుతూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.

194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles