పేరేంటి? పేమెంట్ ఎంత?

Mon,June 18, 2018 05:17 PM

-చంద్రకళ డైరీల్లో షికాగో సెక్స్ రాకెట్ వివరాలు
-ద్వితీయ శ్రేణి తెలుగు నటీమణులకు గాలం
-మొత్తం ఐదుగురు బాధితురాళ్ల వివరాలు నమోదు చేసిన విచారణాధికారి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న షికాగో సెక్స్‌రాకెట్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవకాశాలను, భారీ మొత్తంలో డబ్బును ఎరచూపి ద్వితీయశ్రేణి తెలుగు నటీమణులను వ్యభిచారంలోకి దించిన మోదుగుమూడి కిషన్ దంపతుల గుట్టును.. వారు రాసుకున్న డైరీలు రట్టుచేశాయి. ఏ బాధితురాలిని అమెరికాకు తీసుకువచ్చింది.. ఏ విటుడి దగ్గరకు పంపింది.. ఎంత రేటు మాట్లాడుకుంది.. అన్నీ చంద్రకళ తన డైరీల్లో రాసుకున్నట్టు కేసు దర్యాప్తు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ బ్రియాన్‌గిన్ కోర్టుకు తెలిపారు. తెలుగు సంఘాల కార్యక్రమాల పేరిట అమెరికాకు రప్పించి, వారికి విమాన టిక్కెట్లు, హోటల్ రూంలు బుక్‌చేసినట్టు పక్కా ఆధారాలు సేకరించారు. కోర్టుకు సమర్పించిన అభియోగపత్రాల్లో ఉన్న ప్రకారం.. బాధితురాళ్ల పేర్లను ప్రస్తావించకుండా వారిని ఏ,బీ,సీ,డీ,ఈ పేర్లతోనే పేర్కొనడం తెలుగు సినీ పరిశ్రమలో ఉత్కంఠ రేపుతున్నది.

మూడేండ్లుగా దందా ..

మోదుగుమూడి కిషన్ దంపతులు ఎంత పక్కాగా హైటెక్ సెక్స్‌రాకెట్ నడిపారో వారు రాసుకున్న డైరీలు, వారి ఫోన్లలో చాటింగ్‌లు, ఈ మెయిల్స్ చెబుతున్నాయి. దర్యాప్తు అధికారుల సోదాల్లో 2016, 2017,2018 డైరీలు బయటపడ్డాయి. డైరీల్లో ఎప్పుడెప్పుడు ఏ బాధితురాలిని ఏ విటుడి దగ్గరకు పంపింది. వారు ఇచ్చిన డబ్బు ఎంత..ఇలా ప్రతిదీ రాసి పెట్టారు. ఒక్కో పేజీలో ఒక్కో బాధితురాలి గురించి రాసుకున్నారు. అంతా వారి ఇంటిపేర్లతో బాధితురాళ్ల వివరాలు రాసుకోవడం గమనార్హం. ప్రతిరోజు తేదీ దానికి ఎదురుగా బాణం గుర్తులో వన్‌టైం(ఒకసారి) లేదా టు టైమ్స్(రెండుసార్లు) దానికి మరో బాణం గుర్తు పెట్టి లొకేషన్ షికాగో లేదా నార్త్ కరోలినా అని రాసుకున్నారు. డైరీల్లో అందరి బాధితురాళ్ల ఇంటి పేర్లు సాధారణంగా రాసుకోగా.. ఒక్క బాధితురాలు డి పేరును మాత్రం.. యాంకర్ డి గారు అని చంద్రకళ రాసుకుంది. ఇదే విషయాన్ని విచారణ అధికారి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ యాంకర్ డి గారు ఎవరనే చర్చ సినీ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది.

నన్ను సంప్రదించినా..ఒప్పుకోలేదు: ఓ యాంకర్

పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ, ఇటీవల సినిమాల్లోనూ నటిస్తున్న ఒక యాంకర్ మోదుగుమూడి కిషన్ వ్యవహారంపై స్పందించినట్టు తెలిసింది. ఒక ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాను. కిషన్ వాళ్లు నన్ను సంప్రదించారు. తెలుగు అసోసియేషన్ వాళ్ల కార్యక్రమానికి ఒక దానికి నన్ను హాజరుకావాలని కోరాడు. అయితే అతడు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అందుకే రాలేను అని చెప్పా అని ఆ యాంకర్ ఓ వార్తాసంస్థతో మాట్లాడినట్టు తెలిసింది.

విటులతో కిషన్ దంపతులు నడిపిన

సంభాషణలు, టెక్ట్స్ మెసేజ్‌లు చూస్తే..:
డిసెంబర్ 6, 2017న ఒక వ్యక్తితో చంద్రకళ..:
అజ్ఞాత వ్యక్తి: ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా.. ఫొటోలు పంపు.. మా స్నేహితుడికి కావాలి
చంద్ర: అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
అజ్ఞాత వ్యక్తి: షికాగో
చంద్ర: కేవలం యాంకర్ డి గారు మాత్రమే ఉన్నారు. కొన్ని ఫొటోలు పంపుతాను, కానీ ఒక్కసారికి 2,500 డాలర్లు.
అజ్ఞాత వ్యక్తి: ఫొటోలు చాలా బాగున్నాయి. ఇంకొన్ని ఉంటే పంపు..
చంద్ర: గూగుల్‌లో చూసుకోండి.. డి యాంకర్ అని కొట్టండి వస్తుంది.

అక్టోబర్ 8, 2017న వందడాలర్లు టిప్ కూడా

కావాలంటూ కిషన్ మరో వ్యక్తితో చేసిన సంభాషణ..
అజ్ఞాత వ్యక్తి: నాకు సి కావాలి. ఎంత?
కిషన్: మీకు రెండు ఫొటోలు పంపాను చూడండి.. రేటు ఒకసారికి 2,200 డాలర్లు.
అజ్ఞాత వ్యక్తి: 2,000 అయితే ఓకే..
కిషన్: హయత్‌హౌస్ 2875, టెక్సాస్, 75034.
అజ్ఞాత వ్యక్తి: ఎంత టైం?
కిషన్: రెండు గంటలు..
అజ్ఞాత వ్యక్తి: సరే, 2,000 అయితే వెంటనే వచ్చేస్తా.
కిషన్: నో సర్, 2,000 ప్లస్ 100డాలర్లు టిప్ ఇవ్వాలి.
అజ్ఞాత వ్యక్తి: ఓకే, దారిలో ఉన్నా వస్తున్నా..
కిషన్: రూం నంబర్ 108 సర్..
అజ్ఞాత వ్యక్తి: సరే, దాదాపు దగ్గరికి వచ్చేసాను..

4887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles