ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం


Tue,April 16, 2019 03:13 AM

road accident at vikarabad district

-ఆటోను ఢీకొట్టిన లారీ..
-జుంటిపల్లి జాతరకు వెళ్లొస్తుండగా ఘటన
-మృతుల్లో భార్యాభర్తలు..
-వికారాబాద్ జిల్లా దౌలాపూర్ సమీపంలో ఘటన

యాలాల: వికారాబాద్ జిల్లా యాలాల మం డలం దౌలాపూర్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుంటిపల్లి జాతరకు వెళ్లొస్తున్న వారి ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంటిపల్లికి చెంది న ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు అనంత య్య, అతడి భార్య లక్ష్మి తాండూరులో ఉంటున్నారు. సోమవారం జంటిపల్లిలో జాతరకు వెళ్లారు. తాండూరుకు చెందిన తుల్జమ్మ, భారతమ్మ, శశికళ, ఆశప్ప, అంజిలప్ప కూడా జాతరకు వెళ్లారు. జాతర ముగిసిన అనంతరం వీరంతా ఆటోలో తాండూరుకు వస్తుండగా దౌలాపూర్ గ్రామ సబ్‌స్టేషన్ సమీపంలోకి రాగానే తాండూరు నుంచి టైల్స్ లోడుతో కొడంగల్ వెళ్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న అనంతయ్య, లక్ష్మి దంపతులతోపాటు తుల్జమ్మ, భారతమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. శశికళ, ఆశప్ప, అంజిలప్పకు గాయాలు కాగా వారిని దవాఖానకు తరలించారు. ఆటో డ్రైవర్ ఆశప్ప పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ శివారులోని కోటకదిర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ ఎస్సై భాస్కర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన కృష్ణయ్యగౌడ్(36), భార్య అనిత పాలమూరులో నివాసం ఉంటున్నారు. నర్సింహులు(45) వీరన్నపేటలో నివాసం ఉంటున్నారు. కృష్ణయ్యగౌడ్, నర్సింహులు వంట మాస్టర్లుగా పనిచేస్తుండగా.. అనిత వారికి సాయం చేస్తుంటుంది. ఈ క్రమంలో కోటకదిర గ్రామంలో ఓ ఇంట్లో జరుగనున్న కార్యక్రమానికి వీరం తా వంట చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వీరి వాహనం కోటకదిర స్టేజీ మలువు వద్దకు రాగానే వెనుకనుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహులు, కృష్ణయ్యగౌడ్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రగాయాలైన అనిత పాలమూరు జనరల్ దవాఖానకు.. అనంతరం వైద్యుల సూచ న మేరకు హైదరాబాద్‌లోని ఉస్మాని యా దవాఖానకు తరలించారు. కృష్ణయ్య, అనితలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సింహులుకు భార్య, పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.

3099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles