ప్రమాదవశాత్తు బియ్యం లారీ దగ్ధం


Thu,May 16, 2019 01:30 AM

rice lorry fires over short circuit

-రూ.35 లక్షల నష్టం
నల్లగొండక్రైం: నల్లగొండ సమీపంలోని దండంపల్లి వద్ద బుధవారం ప్రమాదవశాత్తు బియ్యంలోడ్ లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియాలోని బాలాజీ రైస్ మిల్లు నుంచి బియ్యంలోడ్‌తో లారీ ఒడిశాకు బయలుదేరింది. దండంపల్లి సమీపంలోకి రాగానే స్టీరింగ్ జామ్ కావడంతో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. అదే సమయంలో బ్యాటరీలో షార్టుసర్క్యూట్ కావడంతో మంటలు లేచి లారీ పూర్తిగా దగ్ధమైంది. రూ.35 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు బాధితుడు పగిల్ల శంకర్ తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles