224 స్కూళ్లలో పెద్దలకు పాఠాలు


Sat,September 14, 2019 01:28 AM

Review of Education Minister Sabitha Indra Reddy with officials

- అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్యలకు చదువు చెప్పే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 224 పాఠశాలలు ముందుకు వచ్చినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు రెండువేల మంది విద్యార్థులు సంసిద్ధత వ్యక్తంచేశారని తెలిపారు. మున్ముందు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఈ కార్యక్రమంపై ఎస్సీఈఆర్టీలో అధికారులతో జరిపిన సమీక్షలో వయోజనవిద్య అధికారులను మంత్రి ఆదేశించారు.

విద్యామంత్రికి నోట్ పుస్తకాలు అందజేత

విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితాఇంద్రారెడ్డికి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మంత్రిని కలిసిన వీరు.. పుష్పగుచ్ఛాలకు బదులుగా నోట్‌పుస్తకాలను అందజేశారు.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles