పొలాస భూమిపై విచారణచేపట్టాం


Sat,August 17, 2019 02:44 AM

Revenue Officers Response on Dharmaganta Article

-పుట్టకముందే.. భూమిని కొన్నాడు కథనానికి స్పందన
-అసలు హక్కుదారులకు న్యాయంచేస్తాం
-జగిత్యాల రూరల్ తాసిల్దార్ శ్రీనివాసరావు

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ నెల 13న నమస్తే తెలంగాణలో పుట్టకముందే భూమిని కొన్నాడు శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు ఈ కథనం ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని జగిత్యాల రూరల్ తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తాసిల్దార్ మాట్లాడుతూ.. పొలాస శివారులోని సర్వే నంబర్ 639లో ఉన్న 2.16 ఎకరాల భూమిపై విచారణ చేపట్టామన్నారు. సర్వే నంబర్‌లో దేశవేని భీమయ్య పేరిట పహాణీలో 1.08 ఎకరాల భూమి ఉన్నట్టుగా రికార్డులో ఉన్నదనీ, ఈ భూమి రౌతు రాజిరెడ్డి అలియాస్ తిరుపతిరెడ్డి పేరిట 2007-08లో పట్టా అయినట్టుగా రికార్డులో ఉన్నదని చెప్పారు. 1.08 ఎకరాల భూమి తమదంటూ దేశవేని భీమయ్య (తండ్రి నర్సింహులు) ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుతం పట్టాదారుడిగా ఉన్న రాజిరెడ్డి.. తాను ఈ భూమిని దేశవేని భీమయ్య (తండ్రి పేరు పోచయ్య) వద్ద కొన్నానని, వాస్తవంగా పట్టదారుడు అతడేనంటూ చెప్తున్నారని పేర్కొన్నారు.

రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే సర్వే నంబర్ 639లో ఇద్దరు భీమయ్యల పేరిట పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీచేసి ఉన్నాయని, ఇద్దరి తండ్రుల పేర్లు పాస్‌పుస్తకాలపై లేవని వివరించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని, పాత రికార్డులను సైతం పరిశీలిస్తున్నామని చెప్పారు. సేత్వారి, ఖాస్రా పహాణీ, చేసాల రికార్డులను సైతం పరిశీలిస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి విచార ణ జరిపి, అసలు హక్కుదారులకు న్యాయంచేస్తామని అన్నా రు. అలాగే ఈ విషయంపై న్యాయస్థానంలోనూ కేసు ఉన్నదని తాసిల్దార్ శ్రీనివాస రావు పేర్కొన్నారు.

157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles