భూమి తగ్గించారు


Fri,July 12, 2019 01:54 AM

Revenue Officers Hung Mistakes In Pattadar Passbooks

-రికార్డులు సవరించండంటే..రైతుబంధు ఆపేశారు
-ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకొన్నా పట్టించుకోవడం లేదు
-నల్లగొండ జిల్లా మహిళా రైతు ఆవేదన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల గ్రామానికి చెందిన పోట్లోల స్వరూపరాణికి అదే గ్రామంలో సర్వే నంబర్లు 32/ఆ, 32/ఆ 2, 32/ఆ 3, 27/ఈ, 27/ఈ 1, 275/అ లో మొత్తం ఐదెకరాల భూమి ఉన్నది. ఈ భూమిని స్వరూపరాణి 2003 లోనే కొన్నారు. పాస్‌బుక్ కూడా తీసుకొన్నా రు. పహాణీలోనూ స్వరూపరాణి పేరు నమోదైంది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సర్వేచేసిన అధికారులు స్వరూపరాణికి ఉన్న ఐదెకరాల భూమిలో 3.21 ఎకరాలకు మాత్ర మే కొత్త పాస్‌పుస్తకం మంజూరుచేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు పలుమా ర్లు దరఖాస్తుచేసినా పట్టించుకోలేదు. మొత్తం ఐదెకరాల భూమిపై తామే మోఖాలో ఉన్నామని బాధితురాలు తెలిపారు. మిగిలిన 1.19 ఎకరాలు పాస్‌పుస్తకంలో నమోదుచేయకపోగా, రికార్డుల్లో నమోదైన 3.21 ఎకరాలకూ రైతుబంధు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారని వాపోయారు. పాత పాస్‌పుస్తకం ఇచ్చిం ది రెవెన్యూ అధికారులే. కొత్త పాస్‌పుస్తకం ఇచ్చిందీ వారే. మరి నా 1.19 ఎకరాల భూమి ఏమైనట్టు.. తగ్గిన భూమిని రికార్డుల్లో కి ఎక్కించాల్సింది పోయి.. ఉన్నదానికి రైతుబంధు ఆపడం అన్యాయం అని స్వరూపరాణి ఆవేదన వ్యక్తంచేశారు.

మా దృష్టికి రాలేదు

స్వరూపరాణి సమస్య మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకైతే మాకు దరఖాస్తు అందలేదు. సమస్యను మాకు తెలియజేస్తే రికార్డులు పరిశీలిస్తాం. వారికి ఎందుకు భూమి తక్కువగా నమోదైందో చూసి సమస్యను పరిష్కరిస్తాం.
- కిరణ్మయి, కొండమల్లేపల్లి ఎమ్మార్వో

దరఖాస్తు చేసుకొంటే పరిష్కరిస్తాం

నేను ఇటీవలే వీఆర్వోగా ఈ ఊరికి వచ్చాను. ఇంతకుముందున్న వీఆర్వో సస్పెండ్ అయి వెళ్లిపోయారు. స్వరూపరాణి తమ సమస్యపై దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిష్కరిస్తాం.
- నరేందర్, పెండ్లిపాకల వీఆర్వో

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles