పాస్‌బుక్ కోసం వచ్చిన రైతుపై..


Wed,June 19, 2019 02:07 AM

Revenue officers behaving badly towards a farmer who came for a passbook

-పాస్‌బుక్ కోసం వచ్చిన రైతుపై..
-మునుగోడు తాసిల్దార్ ఆగ్రహం

మునుగోడు: పాస్‌పుస్తకం కోసం వచ్చిన ఓ రైతు పట్ల దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడారు నల్లగొండ జిల్లా మునుగోడు తాసిల్దార్ జ్ఞానేశ్వర్‌దేవ్. దీంతో కన్నీటి పర్యంతమైన రైతు పాశం రాంరెడ్డి తనకు పాస్‌పుస్తకం ఇవ్వకపోతే కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బైఠాయించారు. వివిధ పనుల నిమిత్తం అక్కడికి వచ్చినవారు తాసిల్దార్ దురుసు ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన పాశం రాంరెడ్డికి 14.18 ఎకరాల భూమి ఉన్నది. దీనిని తన కుమారుడు పాశం జితేందర్‌రెడ్డి పేరిట 2016లో రిజిస్ట్రేషన్ చేయించి.. పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. కాగా రెవెన్యూ అధికారులు పాస్‌పుస్తకం ఇవ్వకుండా రెండేండ్లుగా తిప్పుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన జితేందర్‌రెడ్డి అధికారుల సూచన మేరకు మీసేవ కేంద్రంలో వేలిముద్రలు నమోదుచేశారు. వారం తర్వాత పాస్‌పుస్తకం ఇస్తామని తాసిల్దార్ చెప్పడంతో తిరిగి మంగళవారం పాశం రాంరెడ్డి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లారు. పాస్‌పుస్తకం గురించి అడుగగానే తాసిల్దార్ ఒక్కసారిగా ఊగిపోయారు. పాస్‌బుక్ వచ్చేటప్పుడే వస్తుంది. మాటిమాటికి ఎందుకొస్తున్నవ్. ముందు నా చాంబర్ నుంచి బయటకువెళ్లూ అంటూ దుర్భాషలాడారు. పాస్‌పుస్తకం కోసం ఎప్పుడు వెళ్లినా తాసిల్దార్ కసురుకుంటున్నారని.. పాస్‌పుస్తకంలేని కారణంగా తమకు రైతుబంధు సాయం అందడంలేదని రాంరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై తాసిల్దార్ జ్ఞానేశ్వర్‌దేవ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా బిజీగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు.

నా భూమిని నాకు అప్పగించండి సారూ..


మెట్టు స్వామి, రైతు

పెద్దమాసాన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 258/12లో 1.10 ఎకరాల భూమిని 30 ఏండ్లుగా సాగుచేసుకుంటున్నాం. కొత్త పాస్‌బుక్‌లు రావడంతో రైతుబంధు డబ్బులు కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు అటవీశాఖ అధికారులు వచ్చి ఈ భూమి అటవీశాఖకు చెందినదని పోలీసులను పెట్టి కందకాలు తీస్తున్నారు. అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారు. నాకు న్యాయంచేయాలి. నా భూమిని నాకు ఇప్పించాలని తాసిల్దార్‌కు ఫిర్యాదుచేశా.
- మెట్టు స్వామి, రైతు, పెద్దమాసాన్‌పల్లి గ్రామం, తొగుల మండలం, సిద్దిపేట జిల్లా

2410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles