రిటైర్డ్ ఆర్డీవోకు పాస్‌పుస్తకాలు


Wed,June 12, 2019 02:10 AM

Retired RDO Bashiruddin Protest At RDO Office Over Not Issuing Pattadar Pass Books

-రిటైర్డ్ ఆర్డీవోకూ తప్పని వ్యథ కథనంపై స్పందన
నల్లగొండ, నమస్తే తెలంగాణ: నల్లగొండ జిల్లా రిటైర్డ్ ఆర్డీవోకు రెవెన్యూ వ్యథ తీరింది. మే నెల 17వ తేదీన రిటైర్డ్ ఆర్డీవోకూ తప్పని వ్యథ శీర్షికన ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. నెల రోజుల తర్వాత మంగళవారం పాస్‌బుక్‌ను మంజూరుచేశారు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రం రెవెన్యూ శివారులోని సర్వే నం.1357, 1358లో 15 గుంటల భూమిని కొనుగోలు చేసిన రిటైర్డ్ ఆర్డీవో బషీరుద్దీన్ కుటుంబసభ్యులకు పాస్‌పుస్తకాలు అందకపోవడంతో, వారు మే 16న ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణ పూర్తి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ వివరాలను ఆరాతీసి విచారణకు ఆదేశించారు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి సూచన మేరకు కనగల్ రెవెన్యూ యంత్రాంగం విచారణ జరిపి ఎట్టకేలకు పాస్‌పుస్తకాలను జారీచేసింది. 1358 సర్వే నంబర్‌లో బషీరుద్దీన్ భార్య వాయిదున్నిసా పేరుమీద 3.20 ఎకరాలతోపాటు పెద్ద కుమారుడి పేరిట 1.20 ఎకరాలను సరిచేసి ఇచ్చారు. రెండో కుమారుడి పేరిట 2 సర్వేనంబర్లలో ఉన్న 3.34 ఎకరాలకు సంబంధించి డిజిటల్ సంతకంచేసి పాస్‌పుస్తకం ముద్రణకోసం పంపినట్లు తాసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.

268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles