దళితుల్లో మహిళలకు అత్యున్నత గౌరవం

Mon,November 11, 2019 01:31 AM

- కొలకలూరి సాహితీ సప్తాహంలో విశ్రాంత జడ్జి జస్టిస్‌ నాగమారుతిశర్మ


త్యాగరాయగానసభ: దళితుల్లో మహిళలకు అత్యున్నత గౌరవం ఉంటుందనే సత్యాన్ని ఇనాక్‌ తన రచనల్లో చూపారని విశ్రాంత న్యా యమూర్తి జస్టిస్‌ నాగమారుతిశర్మ అన్నారు. ఇనాక్‌ రాసిన 100వ గ్రంథం ‘పొలి’ కథాసంపుటిని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ సాహితీ సప్తాహంలో మూడోరోజున ఆదివారం ఆయ న ఆవిష్కరించారు. ఈ కథాసంపుటిలో 19 కథలు ఉన్నాయి. అనంతరం నాగమారుతిశర్మ మాట్లాడుతూ.. ఇనాక్‌పై ఆయన తల్లి ప్ర భావం ఎక్కువగా ఉంటుందని, ఆమె స్ఫూర్తితోనే ఎదిగారని పేర్కొన్నారు. పోతన, జాషువాలా పద్యాలు రాస్తున్నాడనే భావనలేకుండా సొంత ముద్ర కోసమే ఇనాక్‌ కథలు రాయడం మొదలుపెట్టారని చెప్పారు. ఏ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశం దుర్భరంగా మారి ఇబ్బందులు పడ్డారో.. అదే వర్సిటీకి వీసీ కావ డం ఇనాక్‌ గొప్పతనమని కొనియాడారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ సమాజాన్ని మార్చగలిగే శక్తి రచయితలకే ఉంటుందని, ఇనాక్‌ మరిన్ని రచనలు చేసి సమాజోద్ధరణకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో కొలకలూరి శ్రీకిరణ్‌, రమణ వెలమకన్ని, రాజావాసిరెడ్డి మల్లీశ్వరి, రఘుశ్రీ, పెద్దూరి వెంకటదాసు, జనార్దనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles