డోనర్ కార్నర్‌కు స్పందన


Wed,August 14, 2019 12:55 AM

Response to Donor Corner

-విద్యాశాఖకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకువస్తున్న దాతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన డోనర్ కార్నర్ వెబ్‌సైట్‌కు దాతల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఇటీవల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ప్రారంభించిన https://csredu.telangana.gov.in వెబ్‌సైట్‌కు విజిటర్స్ సంఖ్య పెరుగుతున్నదని.. పలువురు వ్యక్తులు, కార్పొరేట్‌సంస్థలు, ఎన్నారైలు విరాళాల గురించి ఫోన్ల ద్వారా అధికారులతో సంప్రదిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. కొన్ని సంస్థలు ఇంగ్లిష్ బోధించడానికి ముందుకు వస్తున్నాయి. స్కూళ్లలో ఆర్వోప్లాంట్లు, వాటర్‌ట్యాంక్‌లు, ల్యాబ్‌లు, ప్రహరీగోడల నిర్మాణాలకు దాతలు విరాళాలు ఇవ్వవచ్చు. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, నోట్‌పుస్తకాలు, ఆటవస్తువులు, టై, షూ, బెల్టులు, స్కూల్‌బ్యాగులు, సైకిళ్లు వంటివి విరాళాల రూపంలో స్వీకరిస్తామని, దాతలు బాలభవన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

107
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles