పాస్‌పుస్తకాలు ఇచ్చేవరకు ఆఫీసులోనే నిద్రిస్తాం


Wed,June 19, 2019 02:06 AM

Relentless revenue officers who turn nine For Pattadar Passbook

-కన్నతల్లి కోసం దివ్యాంగులైన బిడ్డల పోరాటం
-తొమ్మిదేండ్లుగా తిరుగుతున్నా కనికరించని రెవెన్యూ అధికారులు

పెద్దవంగర: తమ తల్లి పేరిట పాస్‌పుస్తకాలు ఇచ్చేవరకు తాసిల్ ఆఫీసులోనే నిద్రపోతామని చెప్తున్నారు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండాకు చెందిన ఇద్దరు దివ్యాంగులు. తమ తల్లిదండ్రులు తొమ్మిదేండ్లుగా తిరిగితిరిగి విసిగిపోయారని, వ్యవసాయశాఖలో పనిచేసే తమ మేనమామ తమకు పాస్‌పుస్తకాలు రాకుండా అడ్డుపడుతున్నాడని వాపోయారు. రామచంద్రు తండాకు చెందిన జాటోతు దళపతి తన కూతురు జమునకు 35 ఏండ్ల కిందట నర్సింహులపేట మండలం ముంగిమడుగు గ్రామం లాలీతండాకు చెందిన గుగులోత్ శంకర్‌తో పెండ్లిచేశారు. వీరికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు దివ్యాంగులు. 2010లో దళపతి తనకున్న సర్వే నంబర్ 405లోని 1.10 ఎకరాల భూమిని జమునకు రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటినుంచి పాస్‌పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు.

పాస్‌పుస్తకం లేకపోవడంతో వారికి రైతుబంధు, రైతుబీమా వర్తించడంలేదు. పాస్‌బుక్ కోసం దివ్యాంగులైన జమున ఇద్దరు కూతుళ్లు అనిత, హరిత మంగళవారం పెద్దవంగర తాసిల్ కార్యాలయానికి వచ్చారు. కానీ అధికారులు కనికరించలేదు. అయితే, మళ్లీ ఇంటికి వెళ్లడానికి బస్‌చార్జీలు లేకపోవడంతో.. ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకున్నారు. ధర్మగంటతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ తాత దళపతి గిఫ్ట్‌గా ఇచ్చిన భూమిని తమ మే నమామ జాటోత్ మనోహర్ కబ్జాచేయాలని చూస్తున్నాడని, అధికారులను కూడా బెదిరిస్తూ తమకు అడ్డుపడుతున్నాడని చెప్పారు. తమ మేనమామ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యవసాయశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తాడని వివరించారు. పెద్దవంగర వీఆర్వో వెంకన్న కావాలనే తమకు పాస్‌పుస్తకాలు జారీచేయకుండా నాన్చుతున్నారని ఆ రోపించారు. తాము 20 రోజులుగా కార్యాల యం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు ప ట్టించుకోవడం లేదని.. రోజూ తిరిగే స్థోమత తమకు లేదని.. పని అయ్యేవరకు ఇక్కడే ఉం డి.. ఆఫీసులోనే నిద్రపోతామని చెప్పారు.

785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles