బాధ్యతల స్వీకరణ

Sat,December 7, 2019 02:57 AM

-విప్‌గా ఆరెకపూడి గాంధీ..
-ఉభయసభల మహిళాశిశు సంక్షేమశాఖ కమిటీ చైర్‌పర్సన్‌గా రేఖానాయక్

హైదరాబాద్/చందానగర్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ విప్‌గా ఆరెకపూడి గాంధీ, ఉభయ సభల మహిళా శిశు సంక్షేమశాఖ కమిటీ చైర్‌పర్సన్‌గా రేఖానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గాంధీ అసెంబ్లీ ఆవరణలో తనకు కేటాయించిన చాంబర్‌లో సీట్లో కూర్చున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండలి చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ నవీన్‌రావు అభినందించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. తనపై నమ్మకముంచి విప్ గా బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉభయసభల మహిళా శిశు సంక్షేమశాఖ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే రేఖానాయక్ అసెంబ్లీ ఆవరణలో తనకు కేటాయించిన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల లలిత, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆమెను అభినందించారు. అనంతరం రేఖానాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కృషిచేస్తున్నదని చెప్పారు.

663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles