అన్నివర్గాల అభివృద్ధికి ప్రోత్సాహం


Mon,August 26, 2019 01:27 AM

Raja Bahadur Venkata Rama Reddy Statue Unveiled by Minister Etela Rajender

మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్ రూరల్: అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ ఎస్సారార్ కళాశాల వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం సీతారాంపూర్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ రెడ్డి సంఘం ఆవరణలో రూ.46 లక్షల నిధులతో రెడ్డి హాస్ట ల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు. రాజాబహద్దూర్ వెంకట రామారెడ్డి చేసిన సేవల స్ఫూర్తితో రెడ్డి సంఘం హాస్టల్, కళాశాల నిర్మాణాల కోసం హైదరాబాద్‌లో విలువైన 18 ఎకరాల స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ విజయ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, తెలంగాణ టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి, రెడ్డి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సాంబమూర్తి ప్రతిభ అద్భుతం

తక్కువ ఖర్చుతో వైండింగ్ యంత్రాన్ని తయారు చేసిన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన తుమ్మ సాంబమూర్తిని మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు. కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేవలం రూ.2వేలు వెచ్చించి వైండింగ్ యం త్రాన్ని రూపొందించిన సాంబమూర్తిని కలిసి ప్రశంసించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ రెండున్నర గంటలు చేసే ఫ్యాన్ వైండింగ్‌ను.. తాను రూపొం దించిన యంత్రంతో గంటలోనే పూర్తి చేయొచ్చన్నారు.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles