మూడ్రోజులు తేలికపాటి వానలు

Sat,November 9, 2019 01:15 AM

హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో పొడివాతావరణం ఉంటుందని చెప్పారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై ఉండదని పేర్కొన్నారు.


గ్రేటర్ హైదరాబాద్‌లో మండుతున్న ఎండ

చలికాలంలోనూ ఎండలు మండుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్‌లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేఘాల ప్రభావంతో రాగల 24 గంటల్లో సాయంత్రం లేదా రాత్రి వేళ అకస్మాత్తుగా వర్షాలు కురువొచ్చని చెప్పారు. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.8 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 60 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles