వచ్చే మూడ్రోజులు వర్షాలు

Wed,September 11, 2019 02:07 AM

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: వచ్చే మూ డ్రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మ ధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా ఉన్నదని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదన్నారు. రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు వారు పేర్కొన్నారు.

140
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles