వర్షాకాల ప్రమాదాలపై రైల్వేశాఖ అప్రమత్తం


Wed,June 12, 2019 01:14 AM

Railways alerted on rainfall dangers

-రైల్వేలైన్ల పరిధిలోని 101 చెరువులకు మరమ్మతులు
-నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి సమీక్ష
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వర్షాకాలం సమీపించడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రైల్వే ట్రాక్‌లకు 32 కి.మీ. పరిధిలోని చెరువులపై నీటిపారుదల, రైల్వే శాఖల అధికారులు మంగళవారం జలసౌధలో సమీక్షా సమావేశం నిర్వహించగా, కృష్ణా, గోదావరి బేసిన్‌ల చీఫ్ ఇంజినీర్లు హమీద్‌ఖాన్, వీరయ్య, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ పాల్గొన్నారు. దాదాపు 726 చెరువులు రైల్వే ట్రాక్‌లకు సమీపంలో ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. కొత్త రైల్వే లైన్లు ఏర్పాటైన నేపథ్యంలో మరో 200 చెరువులు రైల్వే ట్రాక్‌లకు దగ్గరగా ఉంటాయని అంచనావేశారు. 101 చెరువులకు వరదను తట్టుకునేలా మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.

257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles