పొత్తు చర్చలపై కేజ్రీవాల్ యూటర్న్


Tue,April 16, 2019 01:04 AM

Rahul accuses Arvind Kejriwal of making Uturn

-కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ విమర్శ
-తిప్పికొట్టిన ఆప్ అధినేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలపై ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. పొత్తుకు కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని, అయితే సమయం మించిపోతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఉద్దేశం.. బీజేపీని ఓడించడమే. ఇందుకోసం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిని ఆప్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అయితే కేజ్రీవాల్ మరో యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటికీ మా తలుపులు తెరిచే ఉన్నాయి. అయితే సమయం మించిపోతున్నది అని సోమవారం రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. యూటర్న్ తీసుకోవడం ఏమిటి? ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశం మీ ట్వీట్‌లో కనిపించడం లేదు. కేవలం ప్రచారానికే మీరు ఆసక్తి చూపుతున్నట్లు ఉన్నది. ప్రధాని మోదీ, అమిత్‌షాల నుంచి దేశాన్ని కాపాడటం అత్యంత అవసరం. అయితే దురదృష్టవశాత్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో మీరు వారికి సహాయం చేస్తున్నారు అని కేజ్రీవాల్ విమర్శించారు.

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles