నేడు ‘ఆజాద్‌' అవార్డుల ప్రదానం

Mon,November 11, 2019 12:39 AM

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా సోమవారం ఉర్దూ అకాడమీ ఆధ్యర్యంలో పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు అందజేయనున్నట్టు ఉర్దూ అకాడమీ చైర్మన్‌ రహీముద్దీన్‌ అన్సారీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017, 2018 సంవత్సరాలకు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అవార్డులు, 2015 నుంచి 2018 సంవత్సరాలకు మఖ్దూమ్‌ అవార్డులు, 2014 నుంచి 2017 సంవత్సరాలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందించనున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేతులమీదుగా అవార్డుల ప్రదానం ఉంటుందని ఆయన వెల్లడించారు.

114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles