ఆదినుంచీ ఉత్తరాదిదే పెత్తనం


Mon,March 25, 2019 02:07 AM

PV Narasimha Rao successfully led the minority government for five years

-దక్షిణాది వాళ్లంటే చిన్నచూపే..
-ఉత్తరాదివారే 13 మంది ప్రధానులు

అయితే.. కాంగ్రెస్, లేకపోతే.. బీజేపీ దుస్థితిలోని అహేతుకతను మన సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రస్ఫుటంగా నొక్కి చెప్తున్నారంటే, ఆ వాస్తవాన్ని గ్రహించాలి. కేవ లం అయిదేండ్లలోనే యావత్ దేశానికే మన రాష్ర్టాన్ని మార్గదర్శకంగా మార్చారంటే ఆయన కోరుకొనే గుణాత్మక మార్పు ఆవశ్యకతలోని ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించగలుగాలి.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ రాజకీయాల్లో మొదట్నుంచీ ఉత్తరాది వారి పెత్తనమే కొనసాగుతున్నది. దక్షిణాది వారంటే ఢిల్లీలో ఉన్న నేతలకు ఎప్పుడూ చిన్నచూపే. దక్షిణ భారతదేశం అంటే మదరాసీలనే వారు భావిస్తారు. మిగతా భాషా ప్రయుక్తరాష్ర్టాలు ఉన్నాయన్న ఇంగితం వారికి ఉండదు. నాడు ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకోవడం మొట్టమొదటిసారి తెలుగువారి సత్తా ఏమిటో ఢిల్లీలో ఉన్న నేతలకు తెలిసింది. ఆ తర్వాత తెలంగాణ మలిఉద్యమంతో సీఎం కేసీఆర్ నినదించిన జై తెలంగాణ నినాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక మినహా మిగతా ఏ రాష్ర్టాల్లోనూ కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలకు ఉనికిలేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రలో వైసీపీ, టీడీపీ, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీల అండదండలతో ఒకటి రెండు సీట్లతో సరిపుచ్చుకోవడం తప్ప జాతీయ పార్టీలకు సొంతంగా ఎలాంటి అస్తిత్వం లేకుండా పోయింది.

ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాంగ్రెస్ వామపక్షాలు ఉనికిలో ఉన్నాయి. మొన్నటి శబరిమల ఉదంతంతో రెండు పార్టీలూ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో పెద్దగా బలం లేదు కాబట్టే జాతీయ పార్టీలు ఉత్తరాది కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తున్నాయి. దీంతో ఉత్తరాదివారే మొదట్నుంచీ ప్రధానులుగా, కీలక కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తూ వచ్చారు. దక్షిణాది నేతలకు ఒకటోరెండో పదవులు పడేసి సంతృప్తి పరిచారు. ఏడు దశాబ్దాలుగా దేశంలో ఇదే జరుగుతూ వస్తున్నది. ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన పదిహేను మంది ప్రధానుల్లో ఇద్దరు తప్ప మిగతా 13 మంది ఉత్తరాది వారే. 1947 ఆగస్టు 15 న నెహ్రూతో మొదలైన ఈ ట్రెండ్ 1991 వరకూ(చంద్రశేఖర్) అప్రతిహతంగా కొనసాగింది. వీరిలో కూడా ఎక్కువ కాలం ప్రధానులుగా వ్యవహరించింది నెహ్రూగాంధీ కుటుంబమే. అడపాదడపా కొందరు ప్రధానులు అయినా వారి పదవీకాలం ఒకటి రెండేండ్లు మించి లేదు. కాకుంటే వీరంతా కూడా ఉత్తరాదివారే కావడం గమనార్హం.

లోపించిన సమతౌల్యం

ప్రధానమంత్రి ఎవరైనా.. ఏ ప్రాంతానికి చెందిన వారై నా సమస్యేమిటని అనుకొనేవారు ఈ 71 ఏండ్లలో ఆయా రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే అసమతౌల్యం, సవతితల్లి ప్రేమ జవాబు చెప్తాయి. అన్ని రాష్ర్టాల ప్రజలనూ నిష్పాక్షిక దృష్టితో పాలించే నేతలకు మాత్రమే అది సాధ్యమవుతుంది. స్వాతంత్య్ర సమరంలో జీవితాలను త్యాగం చేసిన మహానాయకులు ఎందరో కోరుకొన్నది, కోట్లా ది భారతీయులు కలలుగన్నది సమగ్ర భారతాభివృద్ధి గురించే. కానీ దేశంలో అదే లోపించింది. ఇవాళ అయితే.. కాంగ్రెస్, లేకపోతే.. బీజేపీ దుస్థితిలోని అహేతుకతను మన సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రస్ఫుటంగా నొక్కి చెప్తున్నారంటే, ఆ వాస్తవాన్ని గ్రహించాలి.

కేవలం అయిదేండ్లలోనే యావత్ దేశానికే మన రాష్ర్టాన్ని మార్గదర్శకంగా మార్చారంటే ఆయన కోరుకొనే గుణాత్మక మార్పు ఆవశ్యకతలోని ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించగలుగాలి. జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు భారతదేశ పాలనను ఉత్తరాదికే కేంద్రీకృతమయ్యేలా చేశాయన్నది వాస్తవం. వారు కేంద్రంలో సొం త మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా, దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా వారి ధోరణి మాత్రం పక్షపాతంతోనే సాగింది. ఇతర రాష్ర్టాలను ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈ రకమైన రాజకీయాల్లో మార్పు రావాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కోరుతున్నారు.

దక్షిణాది ప్రధానులు ఇద్దరే

1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం తెలుగువాడు, తెలంగాణ వాడైన పీవీ నరసింహారావు ఐదేండ్లపాటు మైనార్టీ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడిపించారు. తర్వాత సంకీర్ణాలశకం మొదలైన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో 1996లో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా కర్ణాటకకు చెందిన హెచ్‌డీ దేవెగౌడ ఎన్నికయ్యారు. ఈయన ఎక్కువకాలం ఆ పదవిలో ఉండలేదు. ఈ ఇద్దరు (పీవీ, దేవెగౌడ) ప్రధానులు భారతదేశాన్ని పాలించింది కేవలం ఆరేండ్లే. ప్రస్తుత తెలంగాణలో జన్మించిన పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకు (అయిదేండ్లు) ప్రధానిగా ఉండగా, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు (324 రోజులు) పదవిలో ఉన్నారు.

దేశానికి ప్రధానులుగా వ్యవహరించిన గుల్జారీలాల్ నందా, ఐకే గుజ్రాల్, మన్మోహన్‌సింగ్‌లో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. మొరార్జీదేశాయ్, నరేంద్రమోదీ గుజరాత్‌లో పుట్టినవాళ్లు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999లో పూర్తికాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మస్థలం ప్రస్తుత మధ్యప్రదేశ్ అయినప్పటికీ, ఆయన యూపీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

భారతదేశాన్ని పాలించిన ప్రధానులు

pm-north2

2333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles