తల్లిదండ్రుల మృతిని తట్టుకోలేక..


Fri,July 12, 2019 02:19 AM

Punjabi Family Suicide Attempt In Amberpet Two Dead andTwo Members Serious

-భార్య చనిపోవడంతో గుండెపోటుకు గురై కన్నుమూసిన భర్త
-తల్లిదండ్రుల మృతదేహాలతో కొడుకు, కూతురు జాగారం
-మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, ఇద్దరి పరిస్థితి విషమం
-అంబర్‌పేటలో పెను విషాదం

గోల్నాక: ప్రాణంగా ప్రేమించిన భార్య అనారోగ్యంతో చనిపోవడాన్ని జీర్ణించుకోలేని ఒక ఇంటిపెద్ద గుండెపోటుకు గురై కన్నుమూశాడు. తల్లిదండ్రుల మృతదేహాలను ఇంట్లో పెట్టుకొని రాత్రంతా కన్నీరు పెట్టుకొన్న కూతురు, కుమారుడు.. మనస్తాపానికి గురై ఆత్మహత్యాయ త్నం చేశారు. అన్నావదినల మరణవార్త తెలుసుకొని వచ్చిన బంధువు.. అచేతనంగా పడివున్న వారిద్దరినీ సమీపంలోని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమం గా ఉన్నది. కంటతడి పెట్టించే ఈ విషాద ఘట న హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ర్టానికి చెందిన పవన్ కల్పంద, నీలం కల్పంద దంపతులు. వీరికి కూతురు మన్నూ (34), కుమారుడు నిఖిల్ (31) ఉన్నారు. కొన్నేండ్ల క్రితం బతకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వీరు.. డీడీ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. పవన్ కల్పంద ట్రూప్‌బజార్ లో ఎలక్ట్రిక్ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు.

amberpet3
పవన్ భార్య నీలం నాలుగేండ్లుగా కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను ఒక ప్రైవేటు దవాఖానలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతిచెందింది. భార్య మృతిచెందిన విషయాన్ని తట్టుకోలేక భర్త పవన్ ఆదేరోజు రాత్రి గుండెపోటుకు గురై కన్నుమూశాడు. దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు రావడానికి సమయం పట్టడంతో.. వారి కూతురు మన్నూ, కుమారుడు నిఖిల్ మంగళవారం రాత్రి నుంచి తల్లిదండ్రుల మృతదేహాలతో జాగారం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైనవారు బుధవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం పవన్ సోదరుడు హరిదీప్ ఇంటికి వచ్చి తలుపుతట్టగా ఎంతకూ తెరుచుకోలేదు. పోలీసులకు సమాచారం అందించి తలుపులు బద్దలుకొట్టి చూడగా పడకగదిలో నలుగురు అచేతనంగా పడివుండటాన్ని గమనించారు. కొనఊపిరితో ఉన్న మన్నూ, నిఖిల్‌ను సమీపంలోని దవాఖానకు తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
amberpet2

3048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles