జహీరాబాద్‌లో..టీఆర్‌ఎస్ జోరు


Mon,March 25, 2019 01:52 AM

Public should See the Zaheerabad  Development in Five Years of TRS Ruling

-మూడు రాష్ర్టాల సాంస్కృతిక సంగమం.. త్రిభాషా నిలయం
-అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జహీరాబాద్ లోక్‌సభ స్థానానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ ప్రాంతం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. పలు భాషలకు కేంద్రం. కర్ణాటక, మహారాష్ట్రలతో సరిహద్దు కలిగి ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే వారున్నారు. ఏ చిన్న అవసరం ఉన్నా తెలంగాణ రాష్ట్ర సరిహద్దును దాటుకుని దెగ్లూర్, బీదర్ ప్రాంతాలను చుట్టేసి రావడం ఇక్కడి వారికి పరిపాటి. కొండ కోనల్లో విసిరేసినట్లుగా ఉండే గూడెం, తండాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలంతా తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే పక్క రాష్ట్ర సంస్కృతులను పాటిస్తుంటారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో చాలా మందికి మరాఠీ, కన్నడ మాతృ భాషలుగా కొనసాగుతుండడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్లతో జహీరాబాద్ లోక్‌సభ స్థానం ఏర్పడింది.. 2014లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.

నాలుగు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజనతో జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో పలు మార్పు లు, చేర్పులు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈ లోక్‌సభ స్థానం ఆవిర్భవించింది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం గతంలో రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే విస్తరించి ఉండగా ఇప్పు డు కొత్త జిల్లాల ప్రాతిపదికన సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నది. కేంద్ర ఎన్నికల కమిషన్ వెలువరించిన తాజా గణాంకాల ప్రకారం జహీరాబాద్ స్థానం పరిధిలో 14,95,479 మంది ఓటర్లున్నారు.
B.B-PATIL

గులాబీ కంచుకోట

జహీరాబాద్ లోక్‌సభ స్థానం ఇప్పుడు గులాబీ కంచుకోటగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌పై, టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1,44,631 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింటిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. భారీ మెజార్టీ కూడా వచ్చింది. జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు గులాబీ పార్టీకి కంచుకోటగా మారాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటి ఫలాలు అందుకుంటున్న ఇక్కడి ప్రజలంతా టీఆర్‌ఎస్ పార్టీకీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జై కొడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్ అంతా మెజార్టీపైనే దృష్టి సారించింది. ఆ దిశగా ప్రజల్లోకి వెళుతున్నది.

605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles