గుండు గీయించుకున్న రెవెన్యూ ఉద్యోగి

Fri,November 8, 2019 02:01 AM

-తాసిల్దార్ విజయారెడ్డి హత్యకు మహబూబాబాద్‌లో నిరసన
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ: తాసిల్దార్ విజయారెడ్డి హత్య అమానుషమని పేర్కొం టూ మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడోరోజు గురువారం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓ రెవెన్యూ ఉద్యోగి గుండు గీయించుకుని నిరసన తెలిపారు. తాసిల్దార్ హత్య దారుణమని, రెవె న్యూ ఉద్యోగులు విధి నిర్వహణలో భయభ్రాంతులకు గురవుతున్నారని రెవెన్యూ ఎం ప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరా రు. ఈ కార్యక్రమంలో సీపీవో కొమరయ్య, తాసిల్దార్ బన్సీలాల్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles