ప్రభుత్వభూమిని కాపాడాలి


Wed,May 22, 2019 02:01 AM

Protect the government land

ఉపాధికూలీల ఆందోళన
చిన్నచింతకుంట: ప్రభుత్వభూమిని కబ్జాచేయడమే కాకుండా అక్కడ ఉపాధి పనులు చేయకుండా అడ్డుతగులుతున్నారని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉం ద్యాల బస్టాండ్ ఎదుట ఉపాధిహామీ కూలీ లు ఆందోళనకు దిగారు. కొన్నేండ్లుగా ప్రభు త్వ స్వాధీనంలో ఉన్న సర్వే నంబర్ 1లోని నల్లకుంటచెరువుకు చెందిన 5.19 ఎకరాల భూమిని కబ్జాచేశారని, సదరు భూమి ఆన్‌లైన్‌లో అదే గ్రామానికి చెందిన జోషి వేదవ్యాసచారి తండ్రి వెంకటాచారి పేరిట ఉన్నట్టు చూప్తుతున్నదని ఉపాధి కూలీలు ఆరోపించా రు. దీంతో వారు ఆ భూమిలో ఉపాధి పను లు చేయకుండా అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, ఏపీవో నవీన్‌కుమార్, టీఈ మౌనిక కూలీల వద్దకు వచ్చి మాట్లాడారు. భూమి తన పేరు మీద ఉన్నట్టు జోషి వేదవ్యాసచారి పత్రాలు చూపుతున్నారని, ఉపాధి పనులకు మరో ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని చూసుకోవాలని సూచించారు. దీంతో కూలీలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, లింగరాములు, గొల్ల విష్ణువర్దన్, దశరథ్, సందుల దాసు, బోయ రాంచంద్రి, ఎరుకలి వెంకటన్న, గొల్ల వెంకటన్న, గొల్ల బాలరాజు, మండ్ల బాబులు పాల్గొన్నారు.

రైతులపాలిట దేవుడు సీఎం కేసీఆర్

రైతుల సమస్యలను గుర్తించిన దేవుడు సీఎం కేసీఆర్. రైతు సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చి అమలుచేస్తున్న మహనీయుడు. రెవెన్యూశాఖలో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి ఉక్కుపాదం మోపడంతో అధికారుల్లో కదలిక మొదలైంది. అక్రమార్కుల అంతుచూస్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
- కిష్టయ్య, రైతు, మెదక్

431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles