సచివాలయ అధికారులకు పదోన్నతులు


Fri,July 12, 2019 01:29 AM

Promotions to Secretariat Officers

- ఏడుగురికి సంయుక్త కార్యదర్శుల హోదా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సచివాలయంలో అదనపు కార్యదర్శులుగా పనిచేస్తున్న ఏడుగురు అధికారులకు ప్రభు త్వం సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించింది. ముగ్గురు అదనపు కార్యదర్శులను వివిధ పోస్టులకు బదిలీ చేసింది. పదోన్నతి పొందినవారిలో వీ నరేంద్రకుమార్, కేపీ హరీశ్‌కుమార్, పీ కిరణ్‌కుమార్, టీ శేఖర్, వీ పద్మ, కే రమేశ్, కరుణాకర్ ఉన్నారు. సంయుక్త కార్యదర్శిగా పదోన్నతి పొందిన పీ కిరణ్‌కుమార్‌ను పరిశ్రమలశాఖ నుంచి ఫుడ్ కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఫుడ్ కమిషన్ కార్యదర్శిగా ఇప్పటివరకు పనిచేసిన కేఎస్ ప్రసాద్‌ను పరిశ్రమలశాఖకు అదనపు కార్యదర్శిగా, పదోన్నతి పొందిన వీ పద్మను జీఏడీ నుంచి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శిగా, అక్కడ ఉపకార్యదర్శిగా పనిచేస్తున్న సునీతను జీఏడీ సర్వీసెస్‌కు.. జీఏడీ సర్వీసెస్‌లో ఉపకార్యదర్శిగా ఉన్న పద్మావతిని జీఏడీ అకామడేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ఉత్వర్వులు జారీచేశారు.

216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles