ఎస్సీ యువతకు వృత్తినైపుణ్య శిక్షణ


Thu,May 16, 2019 01:23 AM

Professional skills training for SC youth

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎస్సీ నిరుద్యోగ యువతకు వృత్తినైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని ఐటీఐ శిక్షణ సంస్థలో సీఏడీ, ఇంజినీర్ టెక్నికల్ సపోర్ట్, జనరల్ ఆఫీస్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటర్ కోర్సుల్లో చేరేవారికి భోజన, వసతి కల్పించి 90 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. కనీస విద్యార్హత డిగ్రీ, బీటెక్ పూర్తిచేసి, 18 నుంచి 35 ఏండ్ల వయసువారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌తో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7893985821, 8985034503 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles