ప్రమాణాలే ప్రాతిపదిక


Tue,April 16, 2019 12:16 AM

Private Degree College Affiliations to be completed by the end of July

-నెలాఖరునాటికి ప్రైవేటు డిగ్రీ కాలేజీ అఫిలియేషన్లు పూర్తి
-మే 6న దోస్త్ నోటిఫికేషన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2019-20 విద్యాసంవత్సరానికి అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెలాఖరు వరకు దానిని పూర్తి గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను సిద్ధం చేయనున్నామని ఓయూ వీసీ రామచంద్రం తెలిపారు. ఓయూ ఆధ్వర్యంలో దాదాపు 430 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా.. వాటిలో దాదాపు 10 శాతం కాలేజీలు విద్యాప్రమాణాలు పాటించకపోవడంతో అవి మూతపడే అవకాశాలు ఉంటాయని వీసీ పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వబోమన్నారు. ఇలాంటి పరిస్థితులే కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన వంటి అన్ని యూనివర్సిటీల్లో ఉన్నాయని దోస్త్ అధికారులు తెలిపారు. అఫిలియేషన్ పొందిన కాలేజీల జాబితాలను దోస్త్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేయాలని ఇప్పటికే వీసీలకు లేఖలు రాశామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఆ తర్వాత మే 6న దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles