రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఘనస్వాగతం


Wed,December 20, 2017 01:57 AM

President Kovind to attend World Telugu Conference in Hyderabad

president-kovind
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభాపతి మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం లు మహమూద్‌అలీ, కడియంశ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జోగురామన్న, ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, బీజేపీ సభాపక్ష నేత కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారులు పాపారావు, ఏకే గోయల్, అనురాగ్‌శర్మతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు గ్రేటర్ హైదరాబాద్ మహానగర డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రక్షణశాఖ ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ప్రతినిధులందరిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు పరిచయం చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సైనిక వందనం సమర్పించారు.

నేడు రాజ్‌భవన్ పాఠశాలకు రాష్ట్రపతి

ఖైరతాబాద్: సోమాజిగూడలోని రాజ్‌భవన్ పాఠశాలను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమాలకు హాజరైన రాష్ట్రపతి బుధవారం రాజ్‌భవన్ పాఠశాలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తారు. రాష్ట్రంలోనే అధునాతన సోలార్, లిఫ్ట్ తదితర సౌకర్యాలతో, అన్ని హంగులతో నిర్మించిన రాజ్‌భవన్ పాఠశాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిం ద్ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles