ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌రూల్స్ పంపండి

Thu,October 10, 2019 02:13 AM

-అన్నిశాఖల కార్యదర్శులకు పీఆర్సీ చైర్మన్ లేఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌రూల్స్‌ను పంపించాలని అన్నిశాఖల కార్యదర్శులను పీఆర్సీ చైర్మన్ బిశ్వాల్ కోరారు. ప్రస్తుతం ఉన్న సాధారణ, ప్రత్యేక, అడ్‌హక్ ఉద్యోగుల సర్వీస్‌రూల్స్‌ను శాఖలవారీగా అందజేయాలని ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్నారు. సర్వీస్‌రూల్స్ ఒరిజినల్ జీవో కాపీలు, రాష్ట్ర విభజనకు ముందున్న జీవో కాపీలు, అమెండ్‌మెంట్లు వివరాలను రాష్ట్ర, రిజినల్, జిల్లా, డివిజనల్, మండలస్థాయి వివరాలను సమగ్రంగా పంపించాలన్నారు. 33 జిల్లాలవారీగా స్టాఫింగ్ ప్యాటర్న్, స్టాఫ్‌స్ట్రెంత్, మొత్తం ఉద్యోగాలు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, ఖాళీల వివరాలతోపాటు హెచ్‌వోడీల్లోని ఉద్యోగుల వివరాలు తెలియజేయాలని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీలను కూడా ఇవ్వాలని ఆదేశించారు.

420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles