ఏడాదికి ఒకేసారి నోటిఫికేషన్

Fri,January 11, 2019 02:26 AM

-ఫసల్ బీమాపై నూతన మార్గదర్శకాలు
-2019 వానకాలం సీజన్ నుంచే అమలులోకి..
-జిల్లాలు, పంటలవారీగా ప్రకటించిన రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ కమిటీ
-ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పైలట్ ప్రాజెక్టు కింద సాగుచేసిన టమాటా పంటకు వర్తింపు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: 2019 వానకాలం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలు మార్గదర్శకాలలో ప్రభు త్వం మార్పులు చేసింది. సవరించిన మార్గదర్శకాలు 2019-20 వానకాలం, యాసంగి పంటల సీజన్‌లకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సాగుచేసిన టమాటా పంటను పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద చేర్చారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా పథకం అమలుపై రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ కమిటీ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశం ఫసల్ బీమా యోజన మార్గదర్శకాల్లో మార్పులు సూచించింది. మారిన మార్గదర్శకాలకు అనుగుణంగా పంటలు, జిల్లాలను రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది.

క్లస్టర్-1 కింద ఆదిలాబాద్, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట ఉన్నాయి. క్లస్టర్ -2 కింద నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి, రంగారెడ్డి, క్లస్టర్-3 కింద పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, క్లస్టర్ -4 కింద ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, క్లస్టర్-5 కింద భద్రాద్రి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, క్లస్టర్ -6 కింద మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. పంటలవారీగా గ్రామం, మండలం యూనిట్లుగా బీమా వర్తించనుంది. నిజామాబాద్ జిల్లాలో యూపీఐ పథకం అమలు కానుంది. అడవి పందులు, కోతులు, దుప్పులు దాడితో పంటనష్టపోయినా పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకుంటారు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, ఆర్బీఐ, ఎస్‌ఎల్బీసీ, టీఎస్డీపీఎస్, ఏఐసీతో పాటు బీమా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
Bhima

రైతుల కోసం తెలుగులో హెల్ప్‌లైన్

నిజామాబాద్ జిల్లాలో అడవి పందులు, కోతులు పంట నష్టంచేసినా బీమా వర్తింపజేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి సమావేశంలో సూచించారు. రైతుల కోసం తెలుగులో హైల్ప్‌లైన్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. పంటనష్టాన్ని అంచనా వేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు తగినంతమంది సిబ్బందిని నియమించుకోవాలని సూచించిన ఆయన పంటనష్టాన్ని అంచనా వేయడంలో ఆలస్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

4905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles