భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత


Sun,June 16, 2019 03:00 AM

Possession of 380 quintals of counterfeit cotton seeds

-విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
-380 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
-వీటి విలువ సుమారు రూ.4.57 కోట్లు
-మీడియా సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వెల్లడి

మేడ్చల్, నమస్తేతెలంగాణ: నకిలీ విత్తనాల విక్రయాలకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. కోట్లాది రూపాయల విలువైన దాదాపు 380 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి శనివారం మేడ్చల్ వ్యవసా య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకా రం.. వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల నివారణకు జిల్లాల్లోని విత్తనాల కంపెనీలు, కోల్డ్ సోరేజీలు, గోదాముల్లో గత ఏప్రిల్, మే నెలల్లో అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భా గంగా మేడ్చల్ పరిధిలోని పలు ప్రాంతాల్లోగల కోల్డ్ స్టోరేజీల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగారెడ్డి జిల్లా అధికారులు, మేడ్చల్ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి సరైన రికార్డులు లేకుండా నిల్వచేసిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేయకుండా డిటెన్షన్ ఆర్డర్ జారీ చేసి విత్తన పరీక్ష కోసం నమూనాలు సేకరించారు.

వచ్చిన నివేదిక ఆధారంగా అవి నకిలీవని తేలండంతో శనివారం వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మేడ్చల్ పారిశ్రామికవాడలోని తిరుమల తిరుపతి కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన భారత్ అగ్రి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.14,74,800 విలువ చేసే 12.29 క్వింటాళ్లు, ఎసెర్న గ్రూప్ కంపెనీకి చెందిన రూ.46.56 లక్షల విలువ చేసే 38.80 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. గుబ్బ కోల్డ్ స్టోరేజీలోని ఆధార్ సీడ్స్ కు చెందిన రూ.15,00,756 విలువ చేసే 13.13 క్వింటాళ్లు, గోల్డన్ సీడ్‌కు చెందిన రూ.51.60 లక్షల విలువ చేసే 43.39 క్వింటాళ్లు, శ్రీ రానోక్ సీడ్‌కు చెందిన రూ.3,28,80,000 విలువ చేసే 274 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలుగా గుర్తించారు. ఇరు ప్రాంతాల్లో సీజ్ చేసిన 380 క్వింటాళ్ల విత్తనాలు రూ.4,57,46,400 విలువ ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ ముత్యంరెడ్డి తెలిపారు. ఈ ఐదు విత్తన కంపెనీలపై ఐపీసీ 420 కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

నడికూడ మండలం పులిగిల్లలో..

పరకాల, నమస్తే తెలంగాణ: వరంగల్ రూరల్ జిల్లా నడికూడ మండలం పులిగిల్ల గ్రామంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఓ ఇద్దరు వ్యక్తుల వద్ద 42 నకిలీ విత్తన ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బేతు సమ్మయ్య, దద్దు రాజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికిరణ్ తెలిపారు.

సోనాపూర్‌లో..

వాంకిడి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్ శుక్రవారం రాత్రి అధికారు లు, పోలీసులు దాడులు నిర్వహించి 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 410 లీటర్ల నిషేధిత గ్లెఫోసె ట్ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.82 లక్షలు ఉంటుందన్నారు.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles