కూటమి పుట్టల్లో కట్టల్ కట్టల్


Thu,December 6, 2018 03:43 AM

Police Seized Huge Amount At Siddharth Nagar In Kazipet

-కాజీపేటలో రూ.4 కోట్లు స్వాధీనం
-కూటమి అభ్యర్థుల తరఫున బూత్‌లవారీగా ప్యాకింగ్‌చేసిన సొత్తు
-హైదరాబాద్‌లో కోటి నగదు..60 లక్షల విలువైన బంగారం లభ్యం
-గచ్చిబౌలిలో టీడీపీ అభ్యర్థి భవ్యకు చెందిన రూ.40 లక్షలు పట్టివేత
-కూకట్‌పల్లిలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
-జూపూడి ప్రభాకర్‌రావు ఇంట్లో రూ.17.50 లక్షలు స్వాధీనం
-వరంగల్ గ్రామీణంలో 40 లక్షలు, ఖమ్మంలో రూ.8 లక్షలు పట్టివేత
-పలుచోట్ల డబ్బులు పంచుతున్న కూటమి కార్యకర్తల అరెస్టు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఇక ఒక్కరోజే ఉండటంతో ఓట్లను నోట్లతో కొనడానికి కూటమి అభ్యర్థులు తెరలేపారు. పోలింగ్‌బూత్‌లవారీగా ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.1000 పంచేందుకు పక్కాగా ప్రణాళిక రచించారు. నగదు, ఓటరు స్లిప్పులను బండిళ్లుగాచుట్టి సిద్ధంచేసిన సుమారు రూ.4 కోట్ల నగదు బుధవారం కాజీపేటలో పట్టుబడింది. హైదరాబాద్‌లో హవా లా సొత్తు రూ.కోటి నగదు, రూ.60 లక్షల విలువైన బంగారు నగలు పట్టుబడాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రూ.40 లక్షలు పట్టుబడ్డాయి. కూకట్‌పల్లిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్‌రావు ఇంట్లో రూ.17.50 లక్షల నగదు పట్టుబడింది. వరంగల్ గ్రామీణం ఆత్మకూరు మండలంలో హన్మకొండ నుంచి పరకాల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ. 40 లక్షలు దొరికింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓటర్లకు కూటమి అభ్యర్థుల తరఫున నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో నగదు, మద్యం పట్టుబడింది. ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.4 కోట్లు వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట సిద్ధార్థనగర్‌లో అమృతరావు అనే కాంగ్రెస్ నేత అద్దె ఇంట్లో రూ.4 కోట్ల నగదును బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కట్టలుకట్టలుగా పేర్చి ప్యాకింగ్‌చేసి పోలింగ్ బూతులవారీగా పేర్లు రాసి మనిషికి ఐదు వందల నుంచి వెయ్యి చొప్పున పంచేందుకు లెక్కలు వేసుకున్నట్టుగా కనిస్తున్నది. వర్ధన్నపేట టీజేఎస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర, వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ పశ్చిమ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. గురువారం అధికారి కంగా వెల్లడిస్తామని నగర సీపీ విశ్వనాథ్ రవీందర్ తెలిపారు.

హైదరాబాద్‌లో కూటమి నేతల సొమ్ము భారీగా లభ్యం

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం రాత్రి రూ.40 లక్షలు పట్టుబడ్డాయి. ఈ నగదు శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్‌కు చెందినగా అనుమానిస్తున్నారు. చార్మినార్‌కు చెందిన హవా లా వ్యాపారి మయూర్ రామ్‌గుల్బాని చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.50 లక్షల నగదు, 1800 గ్రాముల బంగారం బిస్కెట్లు (సుమారు రూ.60 లక్షలు) తరలిస్తూ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు బృందానికి పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌లో నంది టైర్స్ అండ్ ట్యూబ్స్‌లో మార్కెటింగ్‌లో పనిచేసే కే గణేశ్‌గౌడ్ వద్ద వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.45 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
Maney-Sezed

విమల్ థియేటర్‌లో ఓటర్లకు డబ్బుల పంపిణీ భగ్నం

బాలానగర్‌లోని విమల్ థియేటర్‌లో ప్రజాకూటమికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు పలువురు ఓటర్లకు నగదు పంచుతుండగా పోలీసులు దాడిచేశారు. రూ 8,80,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ట్రిసన్ ఇంపెక్స్ దుకాణంలో రూ.6.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ పీ సుబ్బయ్య నేతృత్వంలో సిద్దంబర్ బజార్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా యూసుఫ్‌గూడకు చెందిన మొబైల్ వ్యాపారి బ్రిజ్ గోపాల్ రాఠి కారులో రూ.6,44,475 నగదు పట్టుబడింది.

కూటమి నేతలు డబ్బులు పంచుతుండగా పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని ఓ పురుగు మందుల దుకాణంలో ఎన్నికల అధికారులు సోదాలు చేపట్టి రూ.5,48,850 నగదు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.2,49,500ను స్వాధీనం చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుం ట గ్రామంలో రూ.1.10 లక్షల విలువైన, ఇటిక్యాల మండలంలో రూ.20 వేల విలువైన మద్యం పట్టుబడింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిన్‌పహాడ్ క్రాస్‌రోడ్డు వద్ద బైక్‌పై తరలిస్తున్న 200 చీరెలను అధికారులు పట్టుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టీ మండలం వెంకట్రావ్‌పేట్ వద్ద 40 మద్యం బాటిళ్లను ఫ్లయింగ్‌స్వాడ్ బృందం పట్టుకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలలో కాంగ్రెస్ నేత గోవర్ధన్‌రెడ్డి (గోపిరెడ్డి) ఓటర్లకు నగదు పంచుతుండగా టీఆర్‌ఎస్ నాయకులు పట్టుకున్నారు. నిందితుడి నుం చి రూ.29,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్‌లోని మంజులాపూర్‌కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున ఓటర్లకు డబ్బులు పంచుతున్న రాజేందర్‌ను అరెస్టు చేసి, రూ.99వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మం డలం సోలీపూర్ సమీపంలో కాంగ్రెస్ నేతలు రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వెళ్తున్న కారులో రూ.5,36,500 పోలీస్‌బృందం స్వాధీనం చేసుకున్నది.
Police

ఖమ్మంలో రూ.8.22 లక్షలు సీజ్

ఖమ్మం నగర బైపాస్ రోడ్డులోని ఎన్వీఆర్ గెస్ట్‌హౌస్‌లో బుధ వారం అర్ధరాత్రి రూ.8.22 లక్షలు సీజ్ చేశారు. కూటమి అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు తరఫున నగదును పంపిణీ చేసేందుకు కార్యకర్తలు మిక్కిలినేని నరేందర్, తుంబూరి వెంకటేశ్వర్‌రావు సిద్ధమవుతుండగా వారిని పోలీసులు అరెస్టు చేసినట్టు నగర ఏసీపీ వెంకటరావు తెలిపారు.

పట్టుబడిన మొత్తం నగదు రూ.93.08 కోట్లు

ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా కట్టడిచేసేందుకు పోలీస్‌శాఖ 414 ఫ్లయింగ్ స్వాడ్స్‌ను రంగంలోకి దింపింది. పోలీసులతోపాటు, ఎక్సైజ్‌శాఖ అధికారులు సైతం మద్యం సరఫరాపై దృష్టి పెట్టారు. స్థానిక అధికారులతోపాటు 3,385 మొబైల్‌పార్టీలు వాహన తనిఖీల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారంవరకు పోలీస్‌శాఖ తనిఖీలో ్ల(ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు కాకుండా) సుమారు రూ.93.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్‌శాఖవర్గాలు తెలిపాయి.
Prabhakar

డబ్బులు పంచుతూ సుహాసిని అనుచరుల అరెస్టు

కూకట్‌పల్లి మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఇంట్లో బుధవారం రాత్రి రూ.17.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులను చూసిన జూపూడి వెంటనే ఇంటి లోపలికి వెళ్లి తన అనుచరులతో డబ్బుల మూటలను బయటికి పంపించే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంబడించి వారిని పట్టుకొన్నారు. సుహాసిని తరపున కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌లో కలిదండి శ్రీనివాసరాజు, కిమావత్ శ్రీరామ్, కిమావత్ ఇంద్రజ ఓటర్లకు డబ్బులను పంపిణీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.

4192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS