లావణ్య హత్యోదంతంపై పోలీసుల ఆరా


Tue,April 16, 2019 01:26 AM

police inquiring lavanya murder case

-ఎయిర్‌పోర్టు లాడ్జ్ రూంలో సోదాలు
-ఆధారాలను పట్టుకొనే ప్రయత్నం

శంషాబాద్ : సూరారానికి చెందిన యువతిని హత్యచేసి సూట్‌కేసులో కుక్కిన కేసులో ఆధారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఆర్సీ పురానికి చెందిన లావణ్యను తన ప్రియుడు సునీల్ ఈ నెల 5న హత్య చేసి శవాన్ని సూట్‌కేసులో కుక్కి సూరారం పరిధిలోని ఓ మోరీ లో పారేసిన విషయం తెలిసిందే. సూడాన్ వెళ్తున్నట్టు నకిలీ విమాన టికెట్లు సృష్టించి ఓ పథకం ప్రకారం ఆమెను తీసుకెళ్లి హత్యచేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు మూలాలను పట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. హంతకుడు సునీల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈనెల 4న హతురాలు లావణ్య, హంతకుడు సునీల్ మకాం వేసి న ఎయిర్‌పోర్టు లాడ్జ్‌లో రూం నంబర్ 106లో సోదా చేశారు.

లాడ్జ్‌లో వారు తీసుకున్న ఆహారం, ఎప్పుడు వచ్చారు.. మరుసటి రోజు (5వ తేదీన) ఎప్పుడు ఎలా బయటకు వెళ్లారు? అనే ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించారు. లాడ్జ్ యజమాని శ్రీనివాస్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. లాడ్జ్ యజమాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. లాడ్జికి వారు వచ్చిన విషయం నిజమేనని, మకాం చేశారని, తదుపరి వ్యవహారం తమకు తెలియదని వివరించారు. పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారని, నిబంధనల మేరకే బోర్డింగ్ పాస్, ఇతర అధికారిక ఆధారాలతోనే వారికి గది కేటాయించినట్టు చెప్పారు.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles