అంతర్రాష్ట్ర గంజాయి స్మగర్ల అరెస్ట్


Wed,June 12, 2019 02:07 AM

Police arrest interstate cannabis smugglers

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను మంగళవారం రాచకొండ పోలీసులు అరెస్ట్‌చేసి, 82 కిలోల గంజాయితోపాటు రూ.30వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ ఏసీపీ గొట్టె సుధీర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కామోజీ కొండల్‌కు జైలులో పరిచయమైన మాణిక్యం, సోదరుడు తేజతో కలిసి గంజాయి వ్యా పారాన్ని ప్రారంభించారు. సోమవారం మీర్‌పేట్ పోలీసులు బడంగ్‌పేట్‌లోని ఓ ఇంట్లో సోదాలు జరిపి 20 ప్యాకెట్లలో ఉన్న 40 కేజీల గంజాయిని, మరో ప్రాంతంలో 42 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles