రివర్స్ టెండరింగ్‌తో వ్యయం పెరుగుతుంది


Wed,August 14, 2019 12:20 AM

Polavaram Project Authority Chairman Arke Jain

-పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరుగడంతోపాటు నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నదని ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ ఆర్కే జైన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో మంగళవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. సుమారు ఐదు గంటలపాటు జరిగిన భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణం ఎలా కొనసాగింది? ఆర్ అండ్ ఆర్ అమలుతీరు తదితర అంశాలపై సమీక్షించారు. పనులు ఆపేయాలంటూ గుత్తేదారుకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడంలో ఉండే లాభనష్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదలశాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది. ఈ సమావేశానంతరం ఆర్కే జైన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని తెలిపారు.

105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles