అర్హులైన పేదలందరికీ ఇండ్లు


Sat,September 14, 2019 02:03 AM

Pocharam srinivas reddy Bhoomi Puja for Double bedroom houses

-స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
-500 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

బాన్సువాడ, నమస్తేతెలంగాణ: అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూ రు చేస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శివారులోని తాడ్కోల్‌లో రూ.26.50 కోట్లతో నిర్మించనున్న 500 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించి పనులు చేసే వారని, తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.500 కోట్లు కేటాయించి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈనెల 24న ఉగాండా దేశంలో 53 దేశాల స్పీకర్లతో నిర్వహించనున్న సమావేశానికి హాజరుకానున్నట్టు పోచారం తెలిపారు. ముందుగా స్పీకర్ బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ దవాఖానలో కలెక్టర్ సత్యనారాయణతో కలిసి రోటా వైరస్ వ్యాక్సిన్ వేశారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles