ఓఆర్‌ఆర్ లోపల సమృద్ధిగా తాగునీరు


Mon,July 22, 2019 02:33 AM

Plenty of drinking water inside the ORR

-ఇప్పటికే తొలివిడుతలో 190 గ్రామాలకు శాశ్వత పరిష్కారం
-రూ.586.86 కోట్లతో ఫేజ్-2 పథకం
-1,094 కిలోమీటర్ల మేర పైపులైన్లు 15 భారీ స్టోరేజీ రిజర్వాయర్లు
-1,300 కాలనీలకు ప్రయోజనం ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్
-త్వరలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపలున్న గ్రామాల్లో తాగునీటి సమస్యలను పూర్తిగా తొలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. మిషన్ భగీరథలో భాగంగా ఇప్పటికే 190 గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. 164 రిజర్వాయర్లలో 139 రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. 1,400 కిలోమీటర్ల మేర పైపులైన్ విస్తరణ పనులను పూర్తిచేసి నల్లాద్వారా ఇంటింటికీ సమృద్ధిగా నీరందిస్తున్నది. మిగిలిన 25 రిజర్వాయర్ల నిర్మాణ పనులను వచ్చే నెలాఖరునాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఓఆర్‌ఆర్ ఫేజ్-1 ఫథకం ద్వారా 1,300 కాలనీలు, బస్తీల్లో దాదాపు 20 లక్షల మందికి దాహార్తి తీరుతుంది. ప్రతి వ్యక్తికి నిత్యం 135 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు.

శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు భారీగా వెలిశాయి. దీంతో ఆ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎస్‌సీసీ సంస్థ రూ.586. 86కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ ఫేజ్-2 పథకానికి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించి జలమండలికి సమర్పించింది. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్నది. నిధులపై స్పష్టత వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు జలమండలి సిద్ధంగా ఉన్నది. ఓఆర్‌ఆర్ ఫేజ్-2లో భాగంగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్‌నగర్, శామీర్‌పేట, కీసర, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఘట్‌కేసర్, శంషాబాద్, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాల పరిధిలో సుమారు 1,094 కిలోమీటర్ల మేర పైపులైన్లను వేసి 1,300 కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటుచేయడంతోపాటు 90 మిలియన్ లీటర్ల నిల్వ సామర్థ్యమున్న 15 భారీ స్టోరేజి రిజర్వాయర్లను నిర్మించనున్నారు.
ORR-water1

542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles