సంచార కులాలపై అధ్యయనం


Fri,July 12, 2019 01:59 AM

Plea for social justice to unrecognised castes

రెండోరోజూ కొనసాగిన బీసీ కమిషన్ క్షేత్ర పరిశీలన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన సంచార కులాలను బీసీ జాబితాలో చేర్చాలని వచ్చిన ప్రతిపాదనల మేరకు సంచార కులాల జీవనం, స్థితిగతుల వివరాలను తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ రెండోరోజైన గురువారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌షాహీ, బేగంబజార్, మంగల్‌హాట్‌లో పర్యటించారు. అహిర్‌యాదవ కులానికి చెందిన కుటుంబాలను కలిసి సమగ్ర వివరాలను సేకరించారు.

bc-commission2
బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట, మేడిపల్లి గ్రామాల్లో పర్యటించి బాగోతుల కులస్థుల జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. వేంపేటలో దయనీయ స్థితిలో ఉన్న ఓ వృద్ధుడికి ఆర్థిక సాయం చేశారు. అలాగే మల్లాపూర్ మండలం ముత్యంపేటలో గౌడజెట్టి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారందించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని వెల్లడించారు.

bc-commission3
బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. సూర్యాపేట కుడకుడ రోడ్డులో నివసిస్తున్న బ్రటి కమ్మరి కుటుంబాల స్థితిగతులను తెలుసుకున్నారు. తిరుమలగిరి మండలం మామిడాల, నాగా రం మండలం వర్ధమానుకోటలో తెల్సూరి గొల్ల కులస్థులతో మాట్లాడారు. తొర్రూరు మండలం పోలెపల్లి, చీకటాయపాలెం గ్రామాల్లో తెరచీరల కులానికి చెందిన కుటుంబాల జీవన విధానం, వారి సాంస్కృతిక నేపథ్యం, వంటి వివరాలను సేకరించారు.

bc-commission4
సిద్ధిపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో అధికారులతో కలిసి బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్ పర్యటించారు. సంచార జాతికి చెందిన కాకిపడగల కులస్థుల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు.

220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles