రహస్యంగా దర్యాప్తు!

Wed,December 4, 2019 02:50 AM

-దిశ కేసు దర్యాప్తులో పోలీసుల వ్యూహం
-పన్నెండు బృందాలతో చార్జిషీట్ తయారీ
-జైలులోనే పోలీసు కస్టడీ, విచారణ జరిగే అవకాశం?

హైదరాబాద్/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంచలనం సృష్టించిన దిశ కేసు దర్యాప్తును అత్యంత రహస్యంగా జరుపాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా నిందితులపై అగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పక్కావ్యూహంతో విచారణ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ షాద్‌నగర్ కోర్టులో పోలీసులు సోమవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, కస్టడీ తీసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి విషయంపై వివరా లు వెల్లడించేందుకు సెక్యూరిటీ కారణాలు చూ పుతూ తామేమీ చెప్పలేమంటూ పేర్కొంటున్నా రు. మరోవైపు నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వాదించేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. షాద్‌నగర్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు నోటీసులు జారీచేసినట్టు సమాచారం. నోటీసులు ఇచ్చిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకుం టే జైలులోనే విచారించాలా? లేదా రహస్య ప్రాం తానికి తీసుకెళ్లాలా అనే అంశంపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.

ప్రజాగ్ర హం నేపథ్యంలో నిందితుల తరలింపు పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. దీంతో వారిని జైలులోనే విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరోవైపు నిందితులపై చార్జిషీట్ తయారుచేసేందుకు అనుభవజ్ఞులైన అధికారులతో పన్నెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిసింది. నిందితులు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా ప్రతి ఆధారాన్ని నిరూపించేలా చార్జిషీట్‌ను తయారుచేస్తున్నారు. దర్యాప్తు విషయాలను బయటకు లీక్‌కాకుండా ఉన్నతాధికారులు సీరియస్‌గా హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. దీంతో దిశ విచారణలో మీడియాకు ఎలాంటి విషయాన్ని చెప్పకుండా పోలీసులు అంతా గప్‌చుప్‌గా వ్యవహరిస్తున్నారు. దిశ కేసులో నిందితులను కలవడానికి మూడురోజులుగా వారి కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు. చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందేనంటూ వారిని కలిసేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడటం లేదు.
TNGO-Protest

టీఎన్జీవో నివాళి

దిశ నిందితులను వెంటనే శిక్షించాలని కోరుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం టీఎన్జీవో భవన్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ తీశారు. మహిళలు, మహిళా ఉద్యోగులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌లు కోరారు. దిశ ఘటన అమానుషమని తెలంగాణ పద్మశాలీ ఆఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి సహదేవ్ అన్నారు.

మోదీ తాత.. అందుకో మా లేఖ

Protest2
లైంగికదాడులకు పాల్పడినవారికి కఠినశిక్షలు అమలుచేయాలని కోరుతూ విద్యార్థులు ప్రధాని నరేంద్రమోదీకి రెండువేల లేఖలు రాశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట, బొంతపల్లి, దోమడుగు, అన్నారం జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు ప్రధానికి లేఖలు రాశారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి దిశకు నివాళి అర్పించారు.
- గుమ్మడిదల

3402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles