నలుదిశలా నిరసనలు

Thu,December 5, 2019 02:51 AM

-దిశ నిందితులను శిక్షించాలంటూ కొవ్వొత్తుల ర్యాలీలు
-సోషల్‌మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసిన ఇద్దరి అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో/చార్మినార్, నమస్తే తెలంగాణ: దిశ విషాదాంతానికి కారకులైన నిందితులకు కఠినంగా శిక్షించాలని, ఆడపిల్లలను రక్షించుకొని సృష్టిని కాపాడుకోవాలని నినదిస్తూ నిజామాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో మెప్మా సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నిజామాబాద్‌లో బార్ అసోసియేషన్, రోటరీ క్లబ్, ఉమెన్స్ కళాశాల, వివిధ ప్రైవేట్ పాఠశాలలు, లేడీస్ క్లబ్, ఇన్నర్‌వీల్ క్లబ్, వాసవి క్లబ్, మార్వాడీ మం చ్, మార్వాడీ యువమంచ్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఐఎంఏ సభ్యులు, గృహిణులు ర్యాలీలు నిర్వహించి నివాళులర్పించారు.

ఇద్దరు యువకుల అరెస్ట్

దిశ ఘటనపై సోషల్‌మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంకు చెందిన ఓ వైద్యురాలి ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పేరొందిన మహిళ పోస్ట్‌పై అనిల్‌కుమార్ అంబాల అనే యువకుడు అసభ్యం గా కామెంట్‌ను పెట్టాడు. ఇది మహిళ ప్రతిష్ఠ కు భంగం కలిగించేలా ఉండటంతో వైద్యురా లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనిల్‌కుమార్‌ను నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో అరెస్టుచేసి, నగరంలోని 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. ఇదే విషయంలో ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఫేస్‌బుక్‌లో సిమ్లీ నానీ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన కనుగుళ్ల సాయినాథ్.. తరచూ మహిళల గూర్చి అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్నాడు. ఇదేక్రమంలో దిశపై అఘాయిత్యం జరుగడంతో తప్పులేదన్నట్టు పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టింగ్‌లకు ముగ్గురు నలుగురు అనుకూల కామెంట్లుచేయగా, మరికొందరు భగ్గుమన్నారు. ఈ పోస్టింగ్‌పై సైబర్‌క్రైం పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు.
Nani

సోషల్‌మీడియాపై కన్ను

అరచేతిలో స్మార్ట్‌ఫోన్.. ఆపై అపరిమిత డాటా ఉన్నదని హద్దు దాటితే చిక్కులు తప్పవు. సున్నితమైన అంశాలు, వ్యక్తిగతంగా ఇతరులను కించపర్చేలా, అగౌరవ పరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవారిపై పోలీస్‌లు సీరియస్‌గా దృష్టిపెట్టారు. దిశ హత్యోదంతంపై ఇటీవల నీచమైన వ్యాఖ్యలు చేసినవారు కటకటాల పాలవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తుచేస్తున్నారు. అడ్డగోలు వ్యాఖ్యలతో చేటు కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా తప్పుడు అభిప్రాయాలు వ్యక్తంచేస్తూ అనవసర గందరగోళం సృష్టించేవారిపై సైబర్ క్రైం పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు.

ఎమ్మెల్యే అనుచిత వాఖ్యలపై ఫిర్యాదు

దిశ ఘటనలో ఓ వర్గ్గానికి చెందిన నిందితునిపై అనుచిత వాఖ్యలుచేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశాయి. దీనిపై బహదూర్‌పుర ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. దిశ ఘటనలో పోలీసు కస్టడీలో ఉన్న ఓ వ్యక్తిపై ఎమ్మె ల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ వర్గం మొత్తం నేర స్వభావం కలిగి ఉంటుందనేలా వ్యాఖ్యానించారంటూ పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

కఠినంగా శిక్షించాలి

-చిలుకూరు అర్చకులు సౌందరరాజన్
శంషాబాద్: దిశ నిందితులకు వెంటనే కఠినశిక్షలు అమలుచేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టును చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కోరారు. బుధవారం ఆయన శంషాబాద్ లో దిశ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాం టి దురాగతాలకు అంగచ్ఛేదన సరైన శిక్ష అన్నారు. ట్రయల్ కోర్టు విధించే శిక్షలను అత్యున్నత న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకొని అమలుచేయాలని కోరారు.

దక్షిణాఫ్రికాలో నివాళి

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ ఆధ్యర్యంలో జస్టిస్ ఫర్ దిశ పేరిట బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో విక్రమ్ పెట్లూరి, వెంకట్ మాగంటి, మనోజా రాజావరపు, బొడ్డుపల్లి, కీర్తికా తదితరులు పాల్గొన్నారు.
Justicefor-disha2
Justicefor-disha1

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles