ఆంధ్రజ్యోతి కథనంపై ఆగ్రహం

Thu,December 5, 2019 02:37 AM

-జిల్లావ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు
-ఆంధ్రజ్యోతి ప్రతులు.. ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మ దహనం
-యాదగిరిగుట్ట ఏసీపీకి టీఆర్‌ఎస్ ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన తప్పుడు కథనంపై యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మండిపడ్డారు. ప్రపంచదేశాలే అబ్బురపడేలా జరుగుతున్న యాదా ద్రి అభివృద్ధిని ఓర్వలేకే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని నిప్పులు చెరిగారు. స్వయంభువు అయిన స్వామివారిని దర్శించుకునే వేలమంది ప్రజల మనోభావాలు దెబ్బతిసేలా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా కథ నం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం యాదగిరిగుట్టలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, వివిధ గ్రామాల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు.

గుట్ట లోని ప్రధాన రహదారిపై ఆంధ్రజ్యోతి దినపత్రికను, ఎండీ రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహ నం చేశారు. తప్పుడు కథనం రాసిన పత్రిక ఎండీపై చర్య లు తీసుకోవాలని యాదగిరిగుట్ట పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. ఆలేరులో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు ఆకవరం మోహన్‌రావు ఆధ్వర్యంలో, ఆత్మకూరు(ఎం) మండ ల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య ఆధ్వర్యంలో, రాజాపేట మండల కేంద్రంలో ఎంపీపీ గోపగాని బాలమ్మణి, జెడ్పీటీసీ గోపాల్‌గౌడ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నాయకత్వంలో, బొమ్మలరామారం మండల కేంద్రంలో ఎంపీపీ చీముల సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో, తుర్కపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడి నేతృత్వంలో, గుండాల మండలంలో టీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
andhrajyothinews1

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles