జనసేన గ్లాసు.. పగిలింది


Fri,May 24, 2019 03:33 AM

pawan-kalyan-loses-bhimavaram-and-gajuwaka-jana-sena-faces-rout

-ప్రశ్నిస్తానని.. పత్తా లేకుండా పోయాడు
-ఏపీలో ప్రభావం చూపించని జనసేన
-సాగని బాబు, పవన్ దొంగపొత్తు
-టీడీపీ ఓటమిపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలో జగన్ ప్రభంజనంలో గాజుగ్లాసు ముక్కలైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ లోపాయికారిగా పొత్తులు పెట్టుకొన్నా.. ఓటర్లు వైసీపీకే అండగా నిలిచారు. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ పార్టీని ఓటర్లు నేలకేసి కొట్టారు. జనసేన అధినేత తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓట్లను చీల్చడమే ప్రధాన ధ్యేయంగా టికెట్లు కేటాయించినప్పటికీ.. ఎక్కడా పవన్ ప్రభావం కనపడలేదు.

ప్రజారాజ్యంతో పోలిస్తే..

పవన్‌కల్యాణ్ అన్న చిరంజీవి అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో తెలంగాణలో 2, ఏపీలో 16 స్థానాల్లో గెలిచి కొంత ఓటు బ్యాంకును నిలబెట్టుకొన్నది. పార్టీ అధినేత చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేశారు. కానీ మార్పు కోసం.. ప్రశ్నిస్తానంటూ వచ్చి.. సభలు పెట్టి, రోడ్ల వెంట తింటూ తిరిగిన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో సోదిలోకి లేకుండా పోయారు. తన అస్తిత్వా న్ని నిలబెట్టుకోకపోగా.. కనీసం చంద్రబాబు కోరుకున్నట్లుగా ఓట్లను కూడా చీల్చలేకపోయారు.

వైసీపీ అభ్యర్థులే లక్ష్యంగా టికెట్లు

టికెట్ల కేటాయింపు సందర్భంగా జనసేన చంద్రబాబు చేతిలోనిదేనని స్పష్టంగా తేలిం ది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచేలా.. వైసీపీ ఓట్లను చీల్చేందుకు జనసేన అభ్యర్థులను నిలబెట్టింది. తనతో కలిసివచ్చిన పార్టీలకు మొండిచెయ్యిచ్చింది. చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పవన్ అభ్యర్థులను మార్చారు. కృష్ణా జిల్లా పామర్రు, నూజివీడు విషయంలో చంద్రబాబు మార్కు స్పష్టమైంది. పామర్రు టికెట్‌ను ముందుగా డీవై దాస్‌కు కేటాయించిన జనసేన.. బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు సూచించడంతో దాస్‌ను మార్చేశారు. జనసేన.. సీపీఐకి కూడా మొండిచెయ్యి ఇచ్చింది. విజయవాడ వెస్ట్, నూజివీడు అసెంబ్లీ స్థానాలు, విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. చంద్రబాబు చెప్పినట్లే పవన్‌చేస్తున్నారని సీపీఐ నేతలు పోలింగ్‌కు ముందే ప్రకటించారు.

విజయవాడ వెస్ట్‌ను తమకు కేటాయించాలని సీపీఐ ముందు నుంచీ కోరినా, పవన్ ఒప్పుకోలేదు. ఇందుకు బదులుగా నూజివీడు స్థానాన్ని సీపీఐకి ఇస్తానని పవన్ చెప్పడంతో ఒప్పుకున్న సీపీఐ అక్కడ అక్కినేని వనజను నిలబెట్టేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే చంద్రబాబు చక్రంతిప్పారు. నూజివీడులో వైసీపీలో నుంచి నాయకుడిని తీసుకువచ్చి జనసేన తరుపున నిలబెడితేనే సాధ్యమవుతుందని భావించా రు. దీంతో పవన్ కల్యాణ్ సీపీఐ అభ్యర్థిని కాదని జనసేన అభ్యర్థిని నిలబెట్టారు. నూజివీడు స్థానానికి బదులు విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఇస్తానని సీపీఐని మరోసారి నమ్మించిన పవన్ అక్కడకూడా ముత్తంశెట్టి కృష్ణబాబును బరిలోకి దింపారు.

దీంతో చంద్రబాబు ఎత్తులు బయటపడ్డాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా గెలవడానికి వీలుగా జనసేన నుంచి పసుపులేటి ఉషాకిరణ్‌ను ప్రకటించారు. ఉషాకిరణ్ భర్త మంత్రి గంటాకు అత్యంత సన్నిహితుడు. భీమిలి నియోజకవర్గంలో కూడా అదే పాటించారు. భీమిలి నుంచి జనసేన నుంచి నిలబడ్డ సందీప్.. టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు సోదరుడు. ఇక పవన్‌కల్యాణ్ అభిమానులు అత్యధికంగా ఉన్నట్లు చెప్పుకునే పాయకరావుపేట నియోజకవర్గంలో ఆ ప్రాంతానికి ఏమాత్రం సంబంధంలేని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నక్కా రాజబాబును దిగుమతిచేశారు. వీటన్నింటినీ గమనించిన ఓటర్లు పవన్‌ను, చంద్రబాబు అనైతిక ఒప్పందాన్ని బద్దలుకొట్టి వైసీపీకే పట్టం కట్టారు. చివరకు ఏదో చేస్తానని వచ్చిన పవన్‌కల్యాణ్ మాత్రం.. రాజకీయ జోకర్‌గానే మిగిలారు.

30 సీట్లలో టీడీపీ ఓట్ల కోత

ఏ టీడీపీనైతే గెలిపించడంకోసం జనసేన తిప్పలుపడిందో.. చివరకు ఆ టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికిన జనసేన.. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించాలని శాయశక్తులా ప్రయత్నించింది. కానీ.. దాదా పు 30అసెంబ్లీ నియో జకవర్గాల్లో జనసేన టీడీపీ ఓట్లనే చీల్చిం ది. వైసీపీ-టీడీపీ ఓట్ల మధ్య అంతరం జనసేనకు వచ్చిన ఓట్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.

7525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles