కన్నకొడుకులు కాదంటున్నారు


Wed,June 12, 2019 02:12 AM

parents complaint file against sons in adilabad dist

ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
బోథ్, నమస్తే తెలంగాణ: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కన్న కొడుకులు ఇంట్లో నుం చి గెంటేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్టలో మంగళవారం చోటుచేసుకున్నది. ఈ మేరకు ఆ వృద్ధదంపతులు ఆర్డీవో కు ఫిర్యాదుచేశారు. కన్గుట్టకు చెందిన మునిగెల చిన్నారెడ్డి, లింగవ్వ దంపతులకు నర్స య్య, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులున్నా రు. వీరు తల్లిదండ్రులకు చెందిన ఆరెకరాల భూమి, ఇండ్లు తమ పేర చేసుకొని ఇంటినుంచి గెంటేశారు. వృద్ధాప్యంలో ఉన్న తమ ను గెంటేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆ వృద్ధ దంపతులు ఆర్డీవో సూర్యనారా యణతో వాపోయారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరారు. తాసిల్ద్దార్‌తో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటామని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు.

1568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles