త్వరలో కానిస్టేబుల్ ఫలితాలు


Sat,September 14, 2019 12:48 AM

Ongoing SB inquiry for Essay candidates

-ఎస్సై అభ్యర్థులకు కొనసాగుతున్న ఎస్బీ విచారణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయన్న ఉత్సుకత అభ్యర్థుల్లో నెలకొన్నది. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన ఎస్సై ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతనే కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మొత్తం 1,217 ఎస్సై పోస్టుల ఎంపిక ప్రక్రియలో చివరి అంకమైన అభ్యర్థుల ఎస్బీ విచారణ కొనసాగుతున్నది. అది పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేస్తామని టీఎస్‌ఎల్పీఆర్బీ అధికారి ఒకరు తెలిపారు.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles