కొనసాగిన ఆర్మీ ర్యాలీ

Thu,October 10, 2019 02:46 AM

కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కొనసాగుతున్నది. మూడోరోజైన బుధవారం జనరల్ డ్యూటీ విభాగంలో యువకులకు అర్హత పరీక్షలు నిర్వహించారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన నియామక ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. జనరల్ డ్యూటీ విభాగంలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో 4,620 మంది దరఖాస్తుచేసుకోగా.. సుమారు 3,500 మంది యువకులు ర్యాలీకి హాజరయ్యారు. తొలుత అడ్మిట్ కార్డులను పరిశీలించిన ఆర్మీ సిబ్బంది యువకులకు 1.6 కిలోమీటర్ల పరుగుపందెం, అందులో అర్హత సాధించినవారికి ఇతర శారీరకసామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ధ్రువపత్రాలను పరిశీలించారు. అన్ని అంశాల్లో అర్హత సాధించిన అభ్యర్థులను వైద్యపరీక్షలకు ఎంపికచేశారు.

441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles