బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ముందడుగు


Thu,May 16, 2019 01:22 AM

One time settlement with the National Animal Husbandry Board

-జాతీయ పాడి అభివృద్ది మండలితో వన్‌టైమ్ సెటిల్‌మెంట్
-రూ. 8 కోట్లకు 2.11 కోట్లు చెల్లించిన తెలంగాణ ఆయిల్‌ఫెడ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం తెలంగాణ ఆయిల్‌ఫెడ్.. జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ)తో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసుకుంది. ఆయిల్‌ఫెడ్ రూ. 8 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, ఇందులో రూ.2.11 కోట్లు బుధవారం ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రూ.3 కోట్లు చెక్కుల రూపంలో చెల్లించారు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మూడునెలల్లో చెల్లించేందుకు ఎన్డీడీబీతో ఆయిల్‌ఫెడ్ అవగాహన కుదుర్చుకుంది.

వాస్తవానికి 2011లో జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని మిల్లు స్థలం, బిల్డింగ్స్, ప్లాంట్, ఇతర మిషనరీ విలు వ రూ.2.37 కోట్లుగా ఉండేది. వేరుశనగ నుం చి నూనె తీసి విజయవర్థనే ఆయిల్ పేరుతో పేరుగాంచిన ఈ మిల్లు 2003లో అప్పటి సీఎం చంద్రబాబు మూసివేయించారు. దీనిని నమ్ముకొని పంటలు సాగుచేసిన రైతులు ఎంతోకాలం ఆందోళన చేశారు. అప్పు చెల్లించి దీనిని తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ తర్వాత వేరుశనగ నూనెతోపాటు పామాయిల్ సహా ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెప్తున్నారు. ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర వరకు ఖర్చుచేస్తే నడుస్తుందని తెలిపారు.

250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles