భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి

Sun,October 13, 2019 01:54 AM

వికారాబాద్ జిల్లా చెల్లాపూర్‌లో ఘటన
కులకచర్ల: జీవిత భాగస్వామి మరణాన్ని జీర్ణించుకోలేక గంటల వ్యవధిలోనే భర్త కూడా తనువు చాలించిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం చెల్లాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్‌రెడ్డిపల్లి చంద్రమ్మ(70) శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త అంజిలయ్య (75) ఒక్కసారిగా కుప్పకూలాడు. భార్య లేకుండా ఎలా గడుపాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేక రోదిస్తూ మూడు గంటలలోపే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆలుమగలిద్దరూ గంటల వ్యవధిలో ప్రాణాలు వదలడం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చంద్రమ్మ, అంజిలయ్య దంపతులకు ఐదుగురు పిల్లలు. దంపతుల అంత్యక్రియల్లో గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

1323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles